<font face="mangal" size="3">ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY) అమĸ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అమలు కై నిబంధనల సవరింపు
RBI/2015-16/437 జూన్ 30, 2016 చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్ అమ్మా/అయ్యా, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) అమలు కై నిబంధనల సవరింపు ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన/ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMJJY/PMSBY), విధి విధానలపై, మా సర్క్యులర్, DCBR.BPD.(PCB) Cir.No.8/12.05.001/2014-15 తేదీ, మే 5, 2015 దయచేసి చూడండి. 2. భారత ప్రభుత్వం ఈ నిబంధనలు సమీక్షించిన తరువాత, సమర్థాదికారి (Competent Authority) PMJJBY నిబంధనలలో జూన్ 1, 2016 నుండి, హక్కు గురించి ఒక షరతు చేర్చాలని, నిశ్చయించారు. ఈ షరతు ప్రకారం, పథకంలో చేరిన మొదటి 45 రోజుల్లో, మృత్యువు సంభవిస్తే, ఆ క్లైమ్ చెల్లించబడదు. మరో విధంగా చెప్పాలంటే, పథకంలో చేరిన 45 రోజుల తరువాతే జీవిత బీమా మొదలవుతుంది. అయితే, మృత్యువు ప్రమాదం కారణంగా సంభవిస్తే, ఈ షరతు వర్తించదు. 3. అన్ని ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు, పై సవరణను అమలు చెయ్యడానికి తగిన చర్యలు తీసుకోవలెను. విధేయులు. (సుమా వర్మ) |