<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్) నిబం&# - ఆర్‌బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్) నిబంధనలు 2009 - సవరణలు
RBI/2018-19/46 సెప్టెంబర్ 7, 2018 ది చైర్‌మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్ / అమ్మా/అయ్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్) నిబంధనలు 2009 - సవరణలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్) నిబంధనలు, 2009 దయచేసి చూడండి. వీటిలో, చినిగిన/ పాడైపోయిన నోట్లను మార్చుటకు అన్ని బ్యాంక్ శాఖలకు అధికారాలు ఇవ్వబడినవి. 2. ప్రజలు మహాత్మా గాంధి (క్రొత్త) సిరీస్‌లో గల పాడయిన నోట్లను బ్యాంక్ శాఖలు, రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాలలో మార్చుకొనుటకు వీలుగా, రిజర్వ్ బ్యాంక్ (నోట్ రిఫండ్) నిబంధనలు, 2009 లో రిజర్వ్ బ్యాంక్ మార్పులు చేసింది. ఈ నోట్లు, ఇతర సిరీస్ నోట్లతో పోలిస్తే చిన్నవి. సవరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్) నిబంధనలు, 2018, గజెట్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 06, 2018లో ప్రకటించబడినవి (ప్రతి, జత చేయబడినది). ఈ నిబంధనలు, తక్షణం అమలులోకి వచ్చాయి. 3. ఏభై రూపాయిలకు మించి విలువగల నోట్ల పూర్తి విలువ చెల్లించుటకు ఆవశ్యకమైన, అవిభాగిత పెద్ద తునక యొక్క కనీస పరిమాణం, మార్పు చేయబడిందని తెలియచేస్తున్నాము. ఈ వివరాలు, సవరణలలో పేర్కొనబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, (మానస్ రంజన్ మొహంతి) జతపరచినవి: పైన తెలిపినవి |