<font face="mangal" size="3">ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు – కేంద్ర / రాష&# - ఆర్‌బిఐ - Reserve Bank of India
ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు – కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలు – ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ప్రత్యేక ఏర్పాట్లు
RBI/2019-20/194 మార్చి 27, 2020 అన్ని ప్రాతినిధ్య బ్యాంకులకు, అయ్యా / అమ్మా, ప్రభుత్వ ఖాతాల వార్షిక ముగింపు – కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలు – ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) ప్రత్యేక ఏర్పాట్లు ప్రాతినిధ్య బ్యాంకులు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో జరిపిన అన్ని ప్రభుత్వ లావాదేవీలు ఇదే ఆర్థిక సంవత్సరంలో లెక్క చూపాలి. అయితే, ప్రస్తుతం కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా కలిగిన విపరీత పరిస్థితులలో, మార్చి 31, 2020 వరకు జరిపిన ప్రభుత్వ లావాదేవీలు నివేదించుటకు, లెక్క చూపుటకు ఈక్రింది ఏర్పాట్లు చేయబడ్డాయి. 2. అన్ని ప్రాతినిధ్య బ్యాంకులు, ప్రభుత్వ లావాదేవీలు జరుపుటకు, వారి నిర్దిష్ట శాఖలలోని కౌంటర్లు మార్చి 31, 2020 తేదీన, సామాన్య పనివేళలవరకు తెరిచి ఉంచవలెను. 3. మార్చి 31, 2020 తేదీన, రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్ విధానం (ఆర్ టి జి ఎస్) ద్వారా ప్రభుత్వ లావాదేవీలు చేయు సమయం పొడిగించబడుతుంది. ఇందుకొరకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, డి పి ఎస్ ఎస్), అవసరమైన ఆదేశాలు జారీచేస్తుంది. నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ ఇ ఎఫ్ టి) ద్వారా లావాదేవీలు, ఇంతకు ముందువలెనే, 24.00 గం. వరకు కొనసాగుతాయి. 4. ప్రభుత్వ చెక్కులు స్వీకరించుటకు, మార్చి 31, 2020 తేదీన, ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించబడుతుంది. ఈసందర్భమై రిజర్వ్ బ్యాంక్ (డి పి ఎస్ ఎస్), తగిన ఆదేశాలు జారీచేస్తుంది. 5. కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలు (జి ఎస్ టి / ఈ – రిసీట్స్, లగేజ్ అప్ లోడింగ్ తో సహా), నివేదించే సదుపాయం మార్చి 31, 2020 నుండి ఏప్రిల్ 1, 2020, 1200 గం వరకు పొడిగించబడుతుంది. 6. ప్రాతినిధ్య బ్యాంకులు, పైన వివరించిన ప్రత్యేక సదుపాయాల గురించి, తగిన ప్రచారం చేయవలెను. మీ విశ్వాసపాత్రులు, (చారులత ఎస్ కర్) |