<font face="mangal" size="3">NBFC-MFI లు, జనవరి 01, 2017 త్రైమాసిక ఆరంభంనుండి వసూలు చేయడ - ఆర్బిఐ - Reserve Bank of India
NBFC-MFI లు, జనవరి 01, 2017 త్రైమాసిక ఆరంభంనుండి వసూలు చేయడానికి
వర్తించే సగటు బేస్ రేట్ (Average Base Rate)
డిసెంబర్ 30, 2016 NBFC-MFI లు, జనవరి 01, 2017 త్రైమాసిక ఆరంభంనుండి వసూలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్, జనవరి 01, 2017 త్రైమాసికం ఆరంభం నుండి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సూక్ష్మ రుణ సంస్థలు (NBFC-MFI s) వసూలు చేయగల సగటు బేస్ రేట్ 9. 41 శాతంగా, ఈరోజు తెలియచేసింది. రుణంయొక్క మూల్యం గురించి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, సూక్ష్మ రుణ సంస్థలకు, రిజర్వ్ బ్యాంక్, ఫిబ్రవరి 7, 2014 న జారీచేసిన సర్క్యులర్ ద్వారా, ప్రతి త్రైమాసికంలో చివరి పనిరోజున, తదుపరి త్రైమాసికంలో NBFC-MFI లు రుణగ్రహీతలనుండి వసూలుచేయగల వడ్డీ రేట్ నిర్ణయించేందుకు వీలుగా, ఐదు అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల సగటు బేస్ రేట్ ఆధారంగా తెలియచేస్తామని ప్రకటించింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/1714 |