<font face="mangal" size="3">అక్టోబర్ 01, 2017 ఆరంభమయే త్రైమాసికానికి, NBFC-MFIల వసూళ్ - ఆర్బిఐ - Reserve Bank of India
అక్టోబర్ 01, 2017 ఆరంభమయే త్రైమాసికానికి, NBFC-MFIల వసూళ్ళకు వర్తించే, సగటు బేస్ రేట్
తేదీ: సెప్టెంబర్ 29, 2017 అక్టోబర్ 01, 2017 ఆరంభమయే త్రైమాసికానికి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ(Non-Banking Financial Companies), సూక్ష్మ రుణ సంస్థలూ (Micro-Finance Institutions) రుణగ్రహీతలనుండి వసూలుచేయగల సగటు బేస్ రేట్, అక్టోబరు 01, 2017 నుంచి ప్రారంభమైన త్రైమాసికానికి 9. 06 శాతమని, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఈ రోజు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ NBFC-MFIలకు, పరపతి వెలపై, ఫిబ్రవరి 7, 2014 సర్క్యులర్ ద్వారా, ప్రతి త్రైమాసికపు ఆఖరి రోజున, తదుపరి త్రైమాసికంలో రుణగ్రహీతలనుండి వారు వసూలు చేయవలసిన వడ్డీ రేట్లు నిర్ణయించుకోవడానికి వీలుగా, ఐదు అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల సగటు బేస్ రేట్లు తెలియచేస్తామని ప్రకటించిన సంగతి, ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/877 |