RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528703

కోవిడ్ -19 రెగ్యులేటరీ ప్యాకేజీ గడువు ముగిసిన తరువాత ఆస్తి వర్గీకరణ మరియు ఆదాయ గుర్తింపు

ఆర్‌బిఐ/2021-22/17
DOR.STR.REC.4/21.04.048/2021-22

ఏప్రిల్ 7, 2021

అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్థిక బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా)
అన్ని ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు / రాష్ట్ర సహకార బ్యాంకులు / జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు
అఖిల భారత ఆర్థిక సంస్థలు
అన్ని బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా)

మేడమ్/ప్రియమైన సర్,

కోవిడ్ -19 రెగ్యులేటరీ ప్యాకేజీ గడువు ముగిసిన తరువాత ఆస్తి వర్గీకరణ మరియు ఆదాయ గుర్తింపు

స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వర్సెస్ UOI & Ors విషయంలో గౌరవనీయమైన సుప్రీంకోర్టు తన తీర్పును మార్చి 23, 2021 న ప్రకటించింది. దీనికి సంబంధించి, ఈ క్రింది విధంగా తెలియజేయడమైనది:

I. ‘వడ్డీ పై వడ్డీ’ యొక్క వాపసు/సర్దుబాటు

2. అన్ని రుణ సంస్థలు1 తాత్కాలిక నిషేధానికి అనుగుణంగా రుణగ్రహీతలకు వసూలు చేసిన 'వడ్డీ పై వడ్డీని' తిరిగి చెల్లించడానికి/సర్దుబాటు చేయడానికి తాత్కాలిక నిషేధం (మోరటోరియం) కాలానికి అంటే మార్చి 1, 2020 నుండి ఆగస్టు 31, 2020 వరకు బోర్డు ఆమోదించిన విధానాన్ని పై తీర్పుకు అనుగుణంగా వెంటనే అమలు చేయాలి. పైన పేర్కొన్న తీర్పు అన్ని రుణ సంస్థలచే సాకారాత్మకంగా ఒకే విధంగా అమలు చేయబడిందని నిర్ధారించడానికి, వివిధ సౌకర్యాల కోసం తిరిగి చెల్లించాల్సిన/సర్దుబాటు చేయవలసిన మొత్తాన్ని లెక్కించే పద్దతిని, ఇతర పరిశ్రమలలో పాల్గొనేవారు/సంస్థలతో సంప్రదించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) ఖరారు చేస్తుంది. ఇది అన్ని రుణ సంస్థలచే స్వీకరించబడుతుంది.

3. పైన పేర్కొన్న ఉపశమనాలు, మార్చి 27, 2020 నాటి DOR.No. BP.BC.47/21.04.048/2019-20 మరియు మే 23, 2020 నాటి DOR.No.BP.BC.71/21.04.048/2019-20 (“కోవిడ్ -19 రెగ్యులేటరీ ప్యాకేజీ”) సర్క్యులర్ల పరంగా, తాత్కాలిక నిషేధం పూర్తిగా లేదా పాక్షికంగా పొందబడిందా లేదా పొందలేదా అనే దానితో సంబంధం లేకుండా, తాత్కాలిక నిషేధం వ్యవధిలో మూలధన సదుపాయాలను పొందిన వారితో సహా అందరు రుణగ్రహీతలకు వర్తిస్తాయి.

4. మార్చి 31, 2021 తో ముగిసిన సంవత్సరానికి వారి ఆర్థిక నివేదికలలో పైన పేర్కొన్న ఉపశమనాల ఆధారంగా రుణగ్రహీతలకు సంబంధించి తిరిగి చెల్లించాల్సిన/సర్దుబాటు చేయవలసిన మొత్తాన్ని రుణ సంస్థలు వెల్లడి చేయాలి.

II. ఆస్తి వర్గీకరణ

5. పై తీర్పు తరువాత, అన్ని రుణ సంస్థల ద్వారా రుణగ్రహీత ఖాతాల ఆస్తి వర్గీకరణ, క్రింద వివరించిన విధంగా ఉన్న సూచనల ద్వారా నిర్వహించబడుతుంది.

i. కోవిడ్-19 రెగ్యులేటరీ ప్యాకేజీ పరంగా ఎటువంటి తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయని ఖాతాలకు సంబంధించి, జూలై 1, 2015 నాటి మాస్టర్ సర్క్యులర్ - ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ మరియు అడ్వాన్సులకు సంబంధించిన ప్రొవిజనింగ్‌పై, ఆస్తి వర్గీకరణ ప్రూడెన్షియల్ నిబంధనలలో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం లేదా రుణ సంస్థల యొక్క నిర్దిష్ట వర్గానికి (IRAC నిబంధనలు) వర్తించే లేదా ఇతర సంబంధిత సూచనల ప్రకారం ఉండాలి.

ii. కోవిడ్-19 రెగ్యులేటరీ ప్యాకేజీ పరంగా తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేసిన ఖాతాలకు సంబంధించి, మార్చి 1, 2020 నుండి ఆగస్టు 31, 2020 వరకు ఆస్తి వర్గీకరణ మే 23, 2020 నాటి సర్కులర్ DOR.No.BP.BC.71/21.04.048/2019-20, ఏప్రిల్ 23, 2020 నాటి సర్కులర్ DOR.No.BP.BC.63/21.04.048/2019-20 తో కలిపి అమలవుతాయి. సెప్టెంబర్ 1, 2020 నుండి ప్రారంభమయ్యే కాలానికి, అటువంటి ఖాతాలన్నిటికి వర్తించే ఆస్తి వర్గీకరణ, IRAC నిబంధనల ప్రకారం ఉండాలి.

మీ విధేయులు,

(మనోరంజన్ మిశ్రా)
చీఫ్ జనరల్ మేనేజర్


1 వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్థిక బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహా), ప్రాథమిక (పట్టణ) సహకార బ్యాంకులు/రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, అఖిల భారత ఆర్థిక సంస్థలు మరియు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా)

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?