<font face="mangal" size="3">భారత్ బిల్ పేమెంట్ ఆప‌రేటింగ్ యూనిట్ (BBPOU‌) గా ప‌ - ఆర్బిఐ - Reserve Bank of India
భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు అథరైజేషన్
ఆగస్టు 30, 2016 భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) గా పని చేసేందుకు అథరైజేషన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ BBPOU గా పని చేసేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించింది. వాటికి ఆమోదంపై నిర్ణయాన్ని లేదా నెట్ వర్త్ సాధించేందుకు ఇచ్చిన గడువు డిసెంబర్ 31, 2016 వరకు పొడిగింపు గురించి లేదా దరఖాస్తులు తిప్పి పంపడం - ఏదైతే అది, వాటికి తెలియపరచడం జరిగింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక సంవత్సరం డొమైన్ అనుభం లేనందువల్ల ఏ నాన్ బ్యాంకింగ్ సంస్థల దరఖాస్తులనైతే తిప్పి పంపడం జరిగిందో, ఆ సంస్థలు అవసరమైన అర్హతా ప్రమాణాలు సాధించేందుకు, గడువును డిసెంబర్ 31, 2016 వరకు పొడిగించమని కోరవచ్చు - అవి దరఖాస్తును పంపేనాటికి బిల్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి ఉన్నట్లుయితే. BBPS పరిధి కింద బిల్లింగ్ వ్యాపారాన్ని చేపడుతున్న సంస్థలు - మే 31, 2017 లోగా ఈ క్రింది సందర్భాలలో ఏదైనా అధీకృత BBPOU కు ఏజెంటుగా మారాల్సి ఉంటుంది లేదా భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) కింద బిల్ పేమెంట్ వ్యాపారం నుంచి వైదొలగాల్సి ఉంటుంది. i. BBPOU గా అథరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకోని సందర్భంలో, లేదా ii. BBPS కొరకు వారి దరఖాస్తును RBI తిప్పి పంపిన సందర్భంలో, లేదా iii. RBI గడువును పొడిగించినప్పటికీ, డిసెంబర్ 31, 2016లోపు నెట్ వర్త్ ను సాధించి, దానిని నివేదించకపోయిన సంస్థలు. ఏ సంస్థలైతే పైన పేర్కొన్న నిబంధనలకు లోబడి ఉండవో, పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ యాక్ట్, 2007 కింద వాటిపై చర్యలు తీసుకొనబడతాయి. BBPS అమలులోకి వచ్చిన తర్వాత, మరియు పొందిన అనుభవం ఆధారంగా, BBPOU గా పని చేసేందుకు అందిన విజ్ఞాపనల కోసం సరికొత్త దరఖాస్తులను ఆహ్వానించడంపై RBI సమీక్ష నిర్వహిస్తుంది. అంతే కాకుండా అర్హతా ప్రమాణాల నిమిత్తం మరియు బిల్లు చెల్లింపుల పరిధి విషయంలో వాటి డొమైన్ అనుభవాన్ని పెంచే అవకాశాలను పరిశీలిస్తుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-2017/536
|