<font face="mangal" size="3">భారతీయ రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ హిందీ ఫీల - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ హిందీ ఫీల్డ్ లో విశిష్ట రచనలకు పురస్కారాలు
అక్టోబర్ 16, 2017 భారతీయ రిజర్వు బ్యాంక్ బ్యాంకింగ్ హిందీ లో మూల (ఒరిజినల్) రచనలు మరియు రీసెర్చ్ ని ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంక్ ‘బ్యాంకింగ్ హిందీ విశిష్ట రచనలకు పురస్కార పథకం’ ను ప్రారంభించింది. ఈ పథకం క్రింద భారతీయ ప్రొఫెసర్లకు (అసిస్టెంట్లు మరియు అసోసియేట్స్, మొదలగువారు కూడా), ఎకనామిక్స్ /బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సబ్జక్ట్స్ మీద హిందీ లో రచించిన పుస్తకాలకు (మూల రచనలు) మూడు ప్రైజ్ లు ఒక్కొక్కదానికి రూ.1,25,000/- (ఒక లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు) చొప్పున ప్రధానం చేయడం జరుగుతుంది. పథకానికి సంబంధించిన వివరాలు అనుబంధం లో ఇవ్వబడినవి. పాల్గొన దలచిన ప్రొఫెసర్స్ వారి ఎంట్రీలను నిర్దేశించిన ఫార్మాట్ లో ది. డిసెంబర్ 15, 2017 (సాయంత్రం ఐదు గంటలవరకు) లోపున, డిప్యూటీ జనరల్ మేనేజర్-ఇన్చార్జ్, రాజ్ భాషా విభాగం , భారతీయ రిజర్వు బ్యాంక్, కేంద్రీయ కార్యాలయం, సీ-9, 2 వ అంతస్తు, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (ఈస్ట్), ముంబాయి 400051 వారికి పంపవలసినదిగా కోరడమైనది. శైలజాసింగ్ ప్రెస్ రిలీజ్: 2017-2018/1050 |