<font face="mangal" size="3">బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 - సెక్షన్ 26A డిప&# - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 - సెక్షన్ 26A డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ (DEAF) పథకం, 2014 - కార్యాచరణ మార్గదర్శకాలు - వడ్డీ చెల్లింపు
ఆర్బిఐ/2017-2018/191 జూన్ 07, 2018 కార్యనిర్వాహక సంచాలకుడు & ముఖ్య కార్యనిర్వహణ అధికారి/ డియర్ సర్ / మాడమ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 - సెక్షన్ 26A డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ (DEAF) పథకం, 2014 - కార్యాచరణ మార్గదర్శకాలు - వడ్డీ చెల్లింపు దయచేసి జూన్ 26, 2014 తేదీ సర్కులర్ DBOD. సంఖ్య DEA ఫండ్ సెల్.బిసి.126 / 30.01.002/2013-14 ను చూడండి. భారతీయ రిజర్వు బ్యాంకు దీని ద్వారా డిపాజిటర్లకు/డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ కు బదిలీ చేయబడే డిపాజిట్ క్లెయిమ్ చేయని దావాదారులకు, బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు తదుపరి సూచన వరకు, సంవత్సరానికి 4% సాధారణ వడ్డీ గా ప్రకటించింది. 2. సమీక్షణానంతరం, డిపాజిటర్లకు/డిపాజిటర్ విద్య మరియు అవగాహన ఫండ్ కు బదిలీ చేయబడే డిపాజిట్ క్లెయిమ్ చేయని దావాదారులకు, బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు సంవత్సరానికి 3.5% సాధారణ వడ్డీ గా, జూలై 01, 2018 నుండి ఉంటుంది. జూలై 01, 2018 నుండి లేదా తర్వాత బ్యాంకులు అందుకున్న అన్ని క్లైముల పరిష్కారం, తదుపరి సూచన వరకు, ఈ వడ్డీ రేటు తో ఉంటుంది. 3. జూన్ 26, 2014 నాటి సర్కులర్ లోని ఇతర నియమ నిబంధనలలో ఎటువంటి మార్పు లేదు. మీ విధేయులు, (ప్రకాష్ బలియార్ సింగ్) |