<font face="Mangal" size="3">ప్ర‌జ‌ల నిమిత్తం నవంబ‌ర్ 12, శ‌నివారం మ‌రియు న‌ - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రజల నిమిత్తం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచబడుతున్న బ్యాంకులు
నవంబర్ 09. 2016 ప్రజల నిమిత్తం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో అన్ని పబ్లిక్, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ, స్థానిక బ్యాంకులతో పాటు అన్ని షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు సాధారణ ప్రజల నిమిత్తం నవంబర్ 12, శనివారం మరియు నవంబర్ 13, ఆదివారాల్లో తెరిచే ఉంచబడతాయి. నవంబర్ 12 మరియు నవంబర్ 13లను సాధారణ పని దినాలుగానే పరిగణించి అన్ని వ్యాపార లావాదేవీల నిమిత్తం తమ శాఖలను తెరిచి ఉంచమని బ్యాంకులకు సూచించడమైనది. బ్యాంకింగ్ సేవలు పైన పేర్కొన్న దినాలలో కూడా అందుబాటులో ఉండే విషయంపై బ్యాంకులు తగినంత ప్రచారం చేయాలి. అల్పనా కిల్లావాలా ప్రెస్ రిలీజ్ : 2016-2017/1161 |