<font face="mangal" size="3">బాసెల్ III మూలధన నిబంధనలు – పరివర్తన (ట్రాన్సిష& - ఆర్‌బిఐ - Reserve Bank of India
బాసెల్ III మూలధన నిబంధనలు – పరివర్తన (ట్రాన్సిషణల్) ఏర్పాట్ల పై సమీక్ష
ఆర్‌బిఐ/2020-2021/93 ఫిబ్రవరి 05, 2021 అన్ని వాణిజ్య బ్యాంకులు మేడమ్/డియర్ సర్, బాసెల్ III మూలధన నిబంధనలు – పరివర్తన (ట్రాన్సిషణల్) ఏర్పాట్ల పై సమీక్ష బాసెల్ III మూలధన నిబంధనలు - పరివర్తన ఏర్పాట్ల సమీక్ష పై సెప్టెంబర్ 29, 2020 నాటి సర్క్యులర్ DOR.BP.BC.No.15/21.06.201/2020-21 ను పరికించండి. 2. కోవిడ్-19 సందర్బంగా కొనసాగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని మరియు రికవరీ ప్రక్రియలో సాయపడటానికి, ఏప్రిల్ 1, 2021 నుండి అక్టోబర్ 1, 2021 వరకు మూలధన పరిరక్షణ బఫర్ (సిసిబి) యొక్క 0.625 శాతం చివరి విడత అమలును వాయిదా వేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం, బాసెల్ III మూలధన నిబంధనలపై జూలై 1, 2015 నాటి మాస్టర్ సర్క్యులర్, DBR.No.BP.BC.1/21.06.201/2015-16 యొక్క పార్ట్ డి 'క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఫ్రేమ్‌వర్క్' లోని పేరా 15.2.2 లోని కనీస మూలధన పరిరక్షణ నిష్పత్తులు, అక్టోబర్ 01, 2021 న సిసిబి 2.5 శాతం స్థాయికి చేరుకునే వరకు కొనసాగుతాయి. 3. అదనపు టైర్ 1 సాధనాల (శాశ్వత నాన్-కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లు మరియు శాశ్వత డెట్ ఇన్స్ట్రుమెంట్స్) మార్పిడి/రైట్-డౌన్ ద్వారా శాశ్వతంగా నష్టాన్ని గ్రహించడానికి ముందుగా పేర్కొన్న ట్రిగ్గర్, రిస్క్ వెయిటెడ్ ఆస్తులలో (RWA లు) 5.5 శాతం వద్దనే ఉంటుంది మరియు అక్టోబర్ 01, 2021 నుండి ఆర్‌డబ్ల్యుఏలలో 6.125 శాతానికి పెరుగుతుంది. మీ విధేయులు, (ఉషా జానకిరామన్) |