<font face="mangal" size="3">బాసెల్ III మూలధన నిబంధనలు - డెట్ మ్యూచువల్ ఫండ్స - ఆర్‌బిఐ - Reserve Bank of India
బాసెల్ III మూలధన నిబంధనలు - డెట్ మ్యూచువల్ ఫండ్స్ / ఇటిఎఫ్‌లు
ఆర్‌బిఐ/2020-21/18 ఆగస్టు 6, 2020 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు మేడమ్/ప్రియమైన సర్, బాసెల్ III మూలధన నిబంధనలు - డెట్ మ్యూచువల్ ఫండ్స్ / ఇటిఎఫ్‌లు బాసెల్ III మూలధన నిబంధనలపై జూలై 1, 2015 నాటి మా సర్క్యులర్ DBR.No.BP.BC.1/21.06.201/2015-16 ను చూడండి. 2. సర్క్యులర్ యొక్క పేరా 8.4.1 ప్రకారం, మ్యూచువల్ ఫండ్ల యూనిట్లకు ఈక్విటీల మూలధన ఛార్జ్ వర్తిస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్/ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్) లో (i) కేంద్ర, రాష్ట్ర మరియు విదేశీ కేంద్ర ప్రభుత్వాల బాండ్లు (ii) బ్యాంక్ బాండ్లు మరియు (iii) కార్పొరేట్ బాండ్ల (ఇతర బ్యాంక్ బాండ్లు కాకుండా) లో బ్యాంకులు పెట్టుబడి పెట్టినప్పుడు, మార్కెట్ రిస్క్ కోసం మూలధన ఛార్జీని ఈ క్రింది విధంగా లెక్కించాలి: ఎ) పూర్తిస్థాయి రుణ వివరాలు అందుబాటులో వున్న డెట్ మ్యూచువల్ ఫండ్/ఇటిఎఫ్‌లో పెట్టుబడులు పెట్టడం కోసం, ఇప్పటివరకు సాధారణ మార్కెట్ రిస్క్ ఛార్జీ 9 శాతంగా ఉంటుంది. వివిధ రకాలైన ఎక్సపోజర్ల కోసం నిర్దిష్ట రిస్క్ క్యాపిటల్ ఛార్జ్, క్రింద వివరించిన విధంగా వర్తించబడుతుంది:
బి) మిశ్రమ రుణ ఇన్స్ట్రుమెంట్స్ కలిగి ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్/ఇటిఎఫ్ విషయంలో, నిర్దిష్ట రిస్క్ మూలధన ఛార్జ్ తక్కువ రేటెడ్ డెట్ ఇన్స్ట్రుమెంట్/అత్యధిక నిర్దిష్ట రిస్క్ మూలధన ఛార్జీని ఆకర్షించే ఇన్స్ట్రుమెంట్ ఆధారంగా, నిర్దిష్ట రిస్క్ మూలధన ఛార్జ్ లెక్కించబడుతుంది. సి) వివరాలు లభ్యం కాని రుణ మ్యూచువల్ ఫండ్ / ఇటిఎఫ్ కోసం, ప్రతి నెల చివరినాటికి, బాసెల్ III మూలధన నిబంధనలపై మాస్టర్ సర్క్యులర్ యొక్క పేరా 8.4.1 లో సూచించిన విధంగా మార్కెట్ రిస్క్ కోసం మూలధన ఛార్జీని లెక్కించడానికి ఈక్విటీతో సమానంగా పరిగణించబడుతుంది. మీ విధేయులు, (సౌరవ్ సిన్హా)
|