<font face="Mangal" size="3px">ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్‌వర్క్ (B - ఆర్బిఐ - Reserve Bank of India
ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్వర్క్ (Basel III Framework on Liquidity Standards) – ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి (Liquidity Coverage Ratio, ఎల్ సి ఆర్) ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షణ సాధనాలు (Liquidity Risk Monitoring Tools) మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలు (LCR Disclosure Standard)
RBI/2017-18/36 ఆగస్ట్ 02, 2017 అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, అయ్యా/అమ్మా, ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్వర్క్ (Basel III Framework on Liquidity Standards) – ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి (Liquidity Coverage Ratio, ఎల్ సి ఆర్) ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షణ సాధనాలు (Liquidity Risk Monitoring Tools) మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలు (LCR Disclosure Standard) ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్వర్క్ - ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి, ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షక సాధనాలు మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలపై జూన్ 9, 2014 తేదీన జారీ చేసిన మా సర్క్యులర్ DBOD.BP.BC.No.120/21.04.098/2013-14, మరియు ఈ క్రింది సర్క్యులర్లద్వారా చేసిన సవరణలు దయచేసి చూడండి.
2. ఇతర భాగస్థులనుండి అందిన అభిప్రాయాలు, మా అనుభవం అధారంగా, ఈ మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించడంజరిగింది. పై సర్క్యులర్లలో చేసిన సవరణలు, ఈ క్రింది అనుబంధంలో చూపబడ్డాయి. మీ విశ్వాసపాత్రులు, ఎస్ ఎస్ బారిక్ అనుబంధాలు: పైన పేర్కొన్నవి ద్రవ్యత్వ ప్రమాణాలపై బాసిల్ III ఫ్రేమ్వర్క్ – ద్రవ్యత్వ కవరేజ్ నిష్పత్తి, ద్రవ్యత్వ నష్ట పర్యవేక్షక సాధనాలు మరియు ఎల్ సి ఆర్ వెల్లడి ప్రమాణాలపై జూన్ 9, 2014 తేదీన జారీ చేసిన సర్క్యులర్ DBOD.BP.BC.No.120/21.04.098/2013-14 లో సవరణలు.
1 కేంద్రీయ బ్యాంక్ నిల్వలు, బ్యాంకు వారితో ఉంచిన ఓవర్నైట్ నిల్వలు, ఈ చెప్పబడిన నిల్వలు కలిపి ఉంటాయి – (i) స్పష్టంగా లేక ఒప్పందానుసారం జమచేసి, బ్యాంకు నోటీసు జారీచేసినంతనే తిరిగి చెల్లించవలసిన డిపాజిట్లు (ii) నియమిత కాలానికిగాని, ఓవర్నైట్ గాని (దానికదే నవీకృతమయే విధంగా మరియు ప్రస్తుతం బ్యాంకు, కేంద్రీయ బ్యాంకులో డిపాజిట్ కలిగి ఉన్నప్పుడు) రుణం తీసికొనే సదుపాయం కలిగి ఉండవలెను. ఇతర టెర్మ్ డిపాజిట్లు HQLA స్టాక్గా పరిగణించడానికి అర్హంకావు. అయితే, 30 రోజులలోపు గడువు ముగిసే డిపాజిట్లు, ఇన్ఫ్లోగా పరిగణించవచ్చు. 2 NDTL లో 2% ప్రభుత్వ సెక్యూరిటీలు కలపవచ్చు (అనగా, ప్రస్తుతం, MSFలో అనుమతించబడినవి) 3 రిజర్వ్ బ్యాంక్ మాస్టర్ సర్క్యులర్ బాసిల్ III క్యాపిటల్ రెగ్యులేషన్స్, తేదీ జులై 1, 2013, పేరా 5.3.1. లో సూచించిన, 0% రిస్క్ వైట్ గల మార్కెట్ సెక్యూరిటీలు మాత్రమే కలిగి ఉండాలి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు, విదేశీ ప్రభుత్వాన్ని నాన్-0% 'రిస్క్ వైట్'గా నిర్ణయించి, జాతీయ విచక్షణ క్రింద, బాసిల్ II ప్రమాణాల అనుసారం 0% 'రిస్క్ వైట్' గా నిర్ణయించిన సందర్భాల్లో, విదేశీ ప్రభుత్వం జారీచేసి/ హామీనిచ్చిన (వారి స్వదేశీ పరిధిలో) మార్కెటబుల్ సెక్యూరిటీలు అనుమతించబడతాయి (ఆ సెక్యూరిటీలు, బ్యాంకు నిర్దుష్టమైన విదేశీ ముద్రా లావాదేవీలు జరిపే అధికార పరిధిలో, ఒత్తిడికిలోనయే నెట్ క్యాష్ ఔట్ఫ్లోకు తగినంత పరిమితివరకు). |