<font face="mangal" size="3">భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ (BBPS‌) - గ‌డువు పొడి - ఆర్బిఐ - Reserve Bank of India
భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) - గడువు పొడిగింపు
మే 09, 2017 భారత్ బిల్ పేమెంట్ వ్యవస్థ (BBPS) - గడువు పొడిగింపు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత BBPS పరిధి కింద బిల్లింగ్ వ్యాపారాన్ని చేపడుతున్న సంస్థలకు - ఏదైనా అధీకృత BBPOU కు ఏజెంటుగా మారేందుకు లేదా బిల్ పేమెంట్ వ్యాపారం నుంచి వైదొలగేందుకు గడువును మే 31, 2017 నుంచి డిసెంబర్ 31, 2017కు పొడిగించినది. ఈ గడువు పొడిగింపు ఈ క్రింది సంస్థలకు వర్తిస్తుంది, i. BBPOU గా అథరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకోని వాటికి, లేదా ii. BBPOU కొరకు దరఖాస్తు చేసుకొన్న వాటిలో, వేటి దరఖాస్తులైతే RBI తిప్పి పంపలేదో వాటికి, లేదా iii. RBI గడువును పొడిగించిన సంస్థలలో, డిసెంబర్ 31, 2016లోపు నెట్ వర్త్ ను సాధించి, దానిని నివేదించకపోయిన సంస్థలు. 2. వివిధ సంస్థలు డెడ్ లైన్ను అందుకోవడంలో ఉన్న ఇబ్బందులను తెలియజేసినందువల్ల గడువును పొడిగించడమైనది. 3. పరిస్థితులను బట్టి, BBPS యొక్క పెరుగుదల మరియు విస్తృతికి ఉన్న అవకాశాలను బట్టి, రిజర్వ్ బ్యాంక్ భవిష్యత్తులో కొత్త దరఖాస్తులను ఆహ్వానించడం ద్వారా ఆమోదాలు మంజూరు చేయడం/BBPOU గా కార్యకలాపాలు నిర్వహించే అధికారాన్ని ఇవ్వడం లాంటి కార్యక్రమాలను తిరిగి చేపట్టే ఆలోచన చేస్తుంది. నేపథ్యం నవంబర్ 28, 2014న BBPS అమలుపై జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుత BBPS పరిధిలో బిల్ పేమెంట్ కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర సంస్థలు, భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ (BBPOU) లేదా అధీకృత BBPOU ఏజెంటుగా BBPS లో భాగస్వామ్యం పంచుకోవచ్చని గుర్తు చేయడం జరుగుతోంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2016-2017/3031
|