RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78522932

బీదర్ మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, కర్నాటక, – జరిమానా విధింపు

తేదీ: 04/02/2019

బీదర్ మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, కర్నాటక, – జరిమానా విధింపు

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్‌ 47A [సెక్షన్‌ 46 (4) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో, బీదర్ మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, కర్నాటకపై, రూ. 50, 000 (ఏభైవేల రూపాయిలు) నగదు జరిమానా విధించింది. డైరెక్టర్లకు, వారి నిర్దిష్ట బంధువులకు రుణాలజారీకి సంబంధించి, అమలులో ఉన్న నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించడమైనది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై వాస్తవాలు, బ్యాంక్ సమర్పించిన జవాబు, పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/1830

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?