<font face="mangal" size="3px">బీదర్ మహిళా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బ - ఆర్బిఐ - Reserve Bank of India
బీదర్ మహిళా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు),సెక్షన్ 35A క్రింద జారీచేసిన సమగ్ర నిర్దేశాల గడువు పొడిగింపు
తేది: 03/09/2019 బీదర్ మహిళా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., బీదర్, - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 బీదర్ అర్బన్ మహిళా కో-ఆపరేటివ్ బ్యాంకు లి., బీదర్, కర్నాటకకు ఫిబ్రవరి 21, 2019 తేదీన జారీచేసిన నిర్దేశాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, మరికొంత కాలం పొడిగించడం అవసరమని రిజర్వ్ బ్యాంక్ భావించిందని, ఇందుమూలముగా ప్రజలకు తెలియజేయడమైనది. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సబ్-సెక్షన్ 1, సెక్షన్ 35A, తమకు దఖలుపరచిన అధికారాలతో, బీదర్ అర్బన్ మహిళా కో- ఆపరేటివ్ బ్యాంక్ లి., కు ఫిబ్రవరి 21, 2019 తేదీన జారీచేయబడి, ఆగస్ట్ 31, 2019 తేదీవరకు అమలులో ఉన్న నిర్దేశాలు, మరొక ఆరు నెలలు, అనగా - సెప్టెంబర్ 01, 2019 నుండి ఫిబ్రవరి 29, 2020 వరకు అమలులో ఉంటాయని ఆదేశించడం జరిగింది. వీటిని సమీక్షించవచ్చు. పైన పేర్కొన్న నిర్దేశాల్లోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పు లేదు. పై నిర్దేశాలు జారీ చేసినంత మాత్రాన, బ్యాంకుయొక్క లైసెన్స్ రద్దు చేసినట్లు భావించరాదు. బ్యాంక్, వారి ఆర్థిక స్థితి మెరుగుపడేవరకు, కొన్ని నిబంధనలతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. పరిస్థితులకు అనుసారంగా, రిజర్వ్ బ్యాంక్, ఈనిర్దేశాలలో మార్పులు చేయవచ్చు. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2019-2020/595 |