<font face="mangal" size="3px">ఏప్రిల్ 01, 2017 నుంచి SBI శాఖ‌లుగా ప‌ని చేయ‌నున్న SBBJ, SBH, SBM, SBP & - ఆర్బిఐ - Reserve Bank of India
ఏప్రిల్ 01, 2017 నుంచి SBI శాఖలుగా పని చేయనున్న SBBJ, SBH, SBM, SBP మరియు SBT శాఖలు
మార్చి 20, 2017 ఏప్రిల్ 01, 2017 నుంచి SBI శాఖలుగా పని చేయనున్న SBBJ, SBH, SBM, SBP ఏప్రిల్ 01, 2017 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (SBBJ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBH), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్(SBM), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా(SBP) మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్ (SBT) బ్యాంకులకు చెందిన అన్ని శాఖలు SBI శాఖలుగా పని చేయనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్ లకు చెందిన ఖాతాదారులు మరియు డిపాజిటర్లు ఏప్రిల్ 01, 2017 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఖాతాదారులుగా పరిగణించబడతారు. భారత ప్రభుత్వము స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ స్వాధీన ప్రకటన 2017, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్వాధీన ప్రకటన 2017, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్వా ధీన ప్రకటన 2017, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా స్వా ధీన ప్రకటన 2017 మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్ స్వాధీన ప్రకటన 2017లను జారీ చేసినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్ లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1955 (23 ఆఫ్ 1955) సబ్ సెక్షన్ (2) ఆఫ్ సెక్షన్ 35కు లోబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్వాధీనపరుస్తూ భారత ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2017న జారీ చేసిన ఆదేశాలను భారత గెజిట్ లోని ఎక్స్ ట్రార్డినరీ పార్ట్ - II సెక్షన్ 3- సబ్ సక్షన్ (i) లో ప్రచురించడం జరిగినది. అల్పనా కిల్లావాలా ప్రెస్ రిలీజ్: 2016-2017/2504 |