<font face="mangal" size="3">భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, బ్&# - ఆర్బిఐ - Reserve Bank of India
భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు
తేదీ: 23/01/2018 భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు భారతీయ రిజర్వ్ బ్యాంక్, వారి ఆదేశం జనవరి 17, 2018 ద్వారా, భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్, భోపాల్, మధ్య ప్రదేశ్ యొక్క బ్యాంకింగ్ లైసెన్సును, జనవరి 22, 2018 పని ముగింపు సమయంనుండి, రద్దుచేసినది. ర్రెజిస్ట్రార్ కో-ఆపరేటివ్ సొసైటీస్, మధ్య ప్రదేశ్‌ను బ్యాంక్ మూసివేసి, లిక్విడేటర్‌ను నియమించవలసిందిగా కోరడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్, ఈ క్రింది కారణాలవల్ల బ్యాంక్ లైసెన్స్ రద్దుచేసినది. i. బ్యాంకుకు చాలినంత మూలధన వ్యవస్థ, లాభార్జన అవకాశాలు లేవు. అందువల్ల బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 11(1) మరియు 22 (3) (d) (సెక్షన్ 56 తో కలిపి) నిబంధనలు నెరవేర్చుటలో విఫలమైనది. ii. బ్యాంకు వారి ప్రస్తుత, భవిష్య డిపాజిటర్లు కోరినప్పుడు వారి సొమ్ము పూర్తిగా చెల్లించేస్థితిలో లేదు. ఈ కారణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22 (3)(a) (సెక్షన్ 56 తో కలిపి) నిబంధనలు నెరవేర్చుటలో విఫలమైనది. iii. బ్యాంకు కార్యకలాపాలు ప్రస్తుత / భవిష్య డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరంగా నిర్వర్తించబడుతున్నాయి. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 22 (3)(b) (సెక్షన్ 56తో కలిపి) నిబంధనలు నెరవేర్చుటలో విఫలమైనది. iv. మూలధన పెంపునకు, పునర్వ్యవస్థీకరణకు ఎటువంటి సకారాత్మక చర్యలు చేపట్టలేదు మరియు నిర్దిష్ట, ఆచరణీయ, పునరుద్ధరణ ప్రణాళిక లేదు. v. ఎంతో సమయం, ఎన్నో అవకాశాలు ఇచ్చినా బ్యాంక్ ఆర్థిక స్థితి పుంజుకొనే పరిస్థితి కనిపించుటలేదు. vi. బ్యాంకింగ్ వ్యాపారంచేయుటకు మరికొంత సమయం అనుమతిస్తే, ప్రజా ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుంది. బ్యాంకింగ్ లైసెన్స్ రద్దుచేసిన కారణంగా, భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, మధ్యప్రదేశ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 5 (b) (సెక్షన్ 56 తో కలిపి) నిర్వచించిన 'బ్యాంకింగ్' కార్యకలాపాలు (డిపాజిట్లు అంగీకరించుట / తిరిగిచెల్లించుటతోసహా) నిర్వర్తించుట, తక్షణం నిషేధించబడినది. లైసెన్స్ రద్దుచేయడం, లిక్విడేషన్ చర్యలు మొదలుకావడంతో, భోపాల్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., భోపాల్, మధ్యప్రదేశ్, ఖాతాదార్లకు, DICGC చట్టం, 1961 ప్రకారం, చెల్లింపులు చేసే ప్రక్రియ ప్రారంభమౌతుంది. లిక్విడేషన్ చర్యలు పూర్తికాగానే, ప్రతి ఖాతాదారు, వారి డిపాజిట్లు, డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) సాధారణ నియమ నిబంధనల ప్రకారం, ₹ 1,00,000/- (కేవలం లక్ష రూపాయిలు) పరిమితి వరకు తిరిగి పొందుటకు అర్హులౌతారు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2010 |