<font face="mangal" size="3">M/s బీమ్‌ మనీ ప్రైవేట్ లి., యొక్క అధికార ధృవపత్రం - ఆర్బిఐ - Reserve Bank of India
M/s బీమ్ మనీ ప్రైవేట్ లి., యొక్క అధికార ధృవపత్రం రద్దు.
మే 04, 2017 M/s బీమ్ మనీ ప్రైవేట్ లి., యొక్క అధికార ధృవపత్రం రద్దు. ఈ క్రింద పేర్కొన్న పేమెంట్ సిస్టెమ్ ఆపరేటర్ (PSO) తమకు జారీ చేసిన ఆధికార ధృవపత్రాన్ని (Certificate of Authorisation, COA) స్వఛ్ఛందంగా తిరిగి ఇచ్చివేసినందున, భారతీయ రిజర్వ్ బ్యాంక్, పేమెంట్ మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 (Payment and Settlement Systems Act 2007) ద్వారా తమకు దఖలు పరచబడిన అధికారాలతో, దానిని రద్దు చేసినది.
COA రద్దుచేసిన కారణంగా, పైన పేర్కొన్న సంస్థ ప్రీ-పైడ్ కార్డ్ల జారీ కార్యకలాపాలు నిర్వహించరాదు. అయితే, వారి PSO వ్యాపారానికి సంబంధించి, వినియోగదారులు ఏవైనా న్యాయమైన హక్కులు కలిగి ఉన్నట్లయితే, వాటి పరిష్కారం కోసం, అనుమతి పత్రం రద్దుచేసిన తేదీనుండి రెండు సంవత్సరాల లోపు, అనగా, 3. 5. 2019 వరకు, M/s బీమ్ మనీ ప్రై. లి., కంపెనీని సంప్రదించవచ్చు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/2981 |