<font face="mangal" size="3">ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయుటకు జారీ చ - ఆర్బిఐ - Reserve Bank of India
ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయుటకు జారీ చేసిన లైసెన్స్ రద్దు మరియు సెక్షన్ 22 మరియు 36A(2), బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) క్రింద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకును స్వఛ్చందంగా కో-ఆపరేటివ్ సొసైటీగా మార్పిడి – షేర్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., జబల్‌పూర్ (మధ్య ప్రదేశ్)
తేదీ: 14/02/2018 ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయుటకు జారీ చేసిన లైసెన్స్ రద్దు మరియు సెక్షన్ 22 షేర్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., జబల్‌పూర్ (మధ్య ప్రదేశ్) స్వఛ్చందంగా వారి బ్యాంకును సహకార సంఘముగా (కో-ఆపరేటివ్ సొసైటీ) మార్చుటకు, మరియు దానిని బ్యాంకింగేతర సంస్థగా ప్రకటించుటకు, రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదన సమర్పించినది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) పరిధిలోనుండి వైదొలగుటకు, సెక్షన్ 36A(2) లో సూచించిన నియమాలను అనుసరించినది. షేర్ నాగ్రిక్ సహకారి బ్యాంక్ లి., జబల్‌పూర్ (మధ్య ప్రదేశ్) లైసెన్సును, రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 08, 2018 తేదీన జారీచేసిన ఆదేశాలద్వారా రద్దు చేసినదని, ఇందుమూలముగా తెలియజేయడమయినది. తదనుసారం, బ్యాంక్, చట్టంలోని సెక్షన్ 5 (cci) (సెక్షన్ 56 తో కలిపి) నిర్వచనం ప్రకారం, కో-ఆపరేటివ్ బ్యాంకుగా ఉనికి కోల్పోయినది. కో-ఆపరేటివ్ బ్యాంకుకు సదరు చట్టంలోని ఏ నియమనిబంధనలూ ఇకపై వర్తించవు. చట్టంలోని సెక్షన్ 22 (సెక్షన్ 56 తో కలిపి) ప్రకారం, ఈ బ్యాంక్, ఇకపై ఇండియాలో బ్యాంకింగ్ వ్యాపారం చేయుటనుండి, నిషేధించబడినది. అందువలన, ఈ బ్యాంకు, చట్టంలో సెక్షన్ 5 (b) లో నిర్వచించిన బ్యాంకింగ్ వ్యాపారం (ప్రజలనుండి డిపాజిట్లు స్వీకరించుట / ప్రజలకు డిపాజిట్లు తిరిగిచెల్లించుటతో సహా), చేయరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/2195 |