<font face="mangal" size="3">ఏటీఎంల నుంచి న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌- రోజువారీ ప‌ĸ - ఆర్బిఐ - Reserve Bank of India
ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ- రోజువారీ పరిమితి పెంపు
RBI/2016-17/204 డిసెంబర్ 30, 2016 ద ఛైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ /చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ- రోజువారీ పరిమితి పెంపు దయచేసి "బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ల నుంచి నగదు ఉపసంహరణ - సడలింపు" పై మేము నవంబర్ 25, 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No. 1424/10.27.00/2016-17 ను గమనించండి. 2. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఏటీఎంల నుంచి రోజువారీ ఉపసంహరణ పరిమితిని (గతంలో ప్రకటించిన ఒక వారం మొత్తంలో ఉపసంహరించుకునే నగదు పరిమితులకు లోబడి) జనవరి 01, 2017 నుంచి ఒక కార్డుకు రూ.2,500 ఉన్న పరిమితిని రూ.4,500కు పెంచడమైనది. అయితే ఒక వారం మొత్తంలో ఉపసంహరించుకునే నగదు పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. ఇలాంటి నగదు పంపిణీ ఎక్కువగా 500 నోట్ల రూపంలో ఉండాలి. 3. మేము నవంబర్ 28, 2016 న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No. 1437/10.27.00/2016-17 ద్వారా నగదు ఉపసంహరణ పరిమితులలో ఇచ్చిన సడలింపులలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. 4. దయచేసి అందినట్లు తెలుపగలరు. మీ విశ్వసనీయులు, (పి. విజయ కుమార్) |