వారి పేరులో "బ్యాంక్" పదం ఉపయోగించే, సహకార సంఘాలగురించి, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక
తేదీ 29/11/2017 వారి పేరులో 'బ్యాంక్' పదం ఉపయోగించే, కొన్ని సహకార సంఘాలు వారి పేరులో 'బ్యాంక్' పదం ఉపయోగిస్తున్నట్లు, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చింది. ఇది సెక్షన్ 7, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (BR Act, 1949) (సహకార సంఘాలకు వర్తించే మేరకు), నిబంధనలకు విరుద్ధం. ఇంతేగాక, కొన్ని సహకార సంఘాలు, సభ్యులు కానివారినుండి / నామినల్ సభ్యులనుండి / అసోసియేట్ సభ్యులనుండికూడా డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియవచ్చింది. అటువంటి సహకార సంఘాలు, బ్యాంకింగ్ వ్యాపారం చేయుటకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ మంజూరు చేయలేదు / అనుమతించలేదని ప్రజలకు తెలియజేయడమైనది. ఈ సొసైటీలలో డిపాజిట్ చేసిన సొమ్ముకు, డిపాజిట్ ఇన్స్యూరెన్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ద్వారా (DICGC) ఎటువంటి బీమా లభించదు. ఈసహకార సంఘాలతో కార్యకలాపాలు జరపడంలో ప్రజలు తగు శ్రద్ధ, జాగ్రత్త వహించాలని సూచిస్తున్నాము. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/1467 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: