<font face="mangal" size="3">బ్యాంక్ రేట్‌లో మార్పు</font> - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంక్ రేట్లో మార్పు
RBI/2016-17/270 ఏప్రిల్ 6, 2017 చైర్ పెర్సన్/ ముఖ్య కార్య నిర్వహణ అధికారులు (CEOs) అయ్యా / అమ్మా, బ్యాంక్ రేట్లో మార్పు పై విషయమై మా సర్క్యులర్ DBR.No.Ret.BC.19/12.01.001/2016-17 తేదీ అక్టోబర్ 04, 2016 దయచేసి చూడండి. 2. మొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన నివేదిక 2017-18 (First Bi-monthly Monetary Policy Statement 2017-18), తేదీ ఏప్రిల్ 06, 2017 లో ప్రకటించిన విధంగా, బ్యాంక్ రేట్ ఏప్రిల్ 06, 2017 నుండి, 25 బేసిస్ పాయింట్లు అనగా 6.75 శాతంనుండి 6.50 శాతానికి సవరించబడినది. 3. బ్యాంక్ రేట్తో ప్రత్యేకించి జోడించబడ్డ నిల్వలలో కొరతపై విధించబడే జరిమానా రేట్లు కూడా, అనుబంధంలో సూచించిన విధంగా సవరించబడినవి. మీ విధేయులు, (సౌరవ్ సిన్హా) జతచేసినవి: పైన సూచించినవి బ్యాంక్ రేట్తో జోడించిన జరిమానా వడ్డీ రేట్లు
|