RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78479610

RTGS కాల అవధుల్లో మార్పు

RBI/2015-2016/168
DPSS(CO) RTGS No.492/04.04.002/2015-2016

సెప్టెంబర్ 1, 2015

RTGS లో భాగస్వామి సంస్థల
చైర్‌మేన్‌, మ్యానేజింగ్ డైరెక్టర్,
చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్
అమ్మా/అయ్యా,

RTGS కాల అవధుల్లో మార్పు

"సెప్టెంబర్ 1 నుండి, రెండవ, నాలుగవ శనివారాల్లో బ్యాంకులకు శెలవు; పనిచేసే శనివారాలలో రిజర్వ్ బ్యాంక్ సహకార సేవలు" అన్న అంశంపై ఆగస్ట్ 28, 2015 న విడుదలచేసిన పత్రికా ప్రకటన సం. 2015-2016/528 దయచేసి చూడండి.

2. అందులో చెప్పబడినట్లు, రెండవ, నాలుగవ శనివారాల్లో RTGS నిర్వహింపబడదు. అయితే, పనిచేసే శనివారాల్లో, రోజంతా నిర్వహింప బడుతుంది. భవిష్యత్తులో నిర్ధారిత తేదీన విలువ ఆధారంగా చేయవలసిన లావాదేవీలు, (future value dated) ఒకవేళ ఆ తేదీ, రెండవ లేక నాలుగవ శనివారం అయినట్లయితే, RTGS, క్రింద చర్యకై చేపట్టబడవు

3. సెప్టెంబర్ 1, 2015 నుండి RTGS పని వేళలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

క్రమ సంఖ్య కాల/కార్య వివరణ శనివారాలతో సహా నెలలో అన్ని రోజులు (రెండవ మరియు నాలుగవ శనివారాలు మినహా)
1. కార్య కలాపాల ఆరంభం 08. 00 గం.
2. మొదటి ముగింపు (వినియోగదారుల లావాదేవీలు) 16. 30 గం.
3. తుది ముగింపు (ఇంటర్ బ్యాంక్ లావాదేవీలు) 19. 45 గం.
4. ఐ డి ఎల్ రివర్సల్ 19. 45 గం. – 20. 00 గం.
5. కార్యకలాపాల ముగింపు 20. 00 గం.

4. ఈ సర్క్యులర్, పేమెంట్ & సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఏక్ట్ 2007, సెక్షన్‌ 10 (2) క్రింద జారీ చేయబడింది.

5. దయచేసి ఇది అందినట్లు తెలియజేయవలెను

నీలిమా రాంటెకె
జనరల్ మేనేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?