<font face="mangal" size="3">నిర్దిష్ట బ్యాంక్ నోట్లపై (Specified Bank Notes) వివరణ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
నిర్దిష్ట బ్యాంక్ నోట్లపై (Specified Bank Notes) వివరణ
జనవరి 05, 2017 నిర్దిష్ట బ్యాంక్ నోట్లపై (Specified Bank Notes) వివరణ సమర్పించబడిన నిర్దిష్ట బ్యాంక్ నోట్లపై వివిధ వర్గాల్లో, విభిన్న అంచనాలు ఉన్నాయి. నిర్దిష్ట నోట్ల యొక్క గణాంకాలు, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో 'కరెన్సీ చెస్ట్‌ల' (Currency Chests) వద్ద నమోదయిన అకౌంటింగ్ ఎంట్రీల ఆధారంగా, మాచే నిర్ణీత కాలాల్లో విడుదల చేయబడుతున్నాయి. ఈ పథకం డిసెంబర్ 30, 2016 తేదీన ముగిసింది గనుక, ఏవేని తప్పులు, రెండుమార్లు లెక్కింపులు వంటి పొరపాట్లు తొలగించడానికి, ఈ గణాంకాలు భౌతిక నగదు నిల్వలతో సమన్వయించవలసి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రక్రియ ఇంతకు మునుపే ప్రారంభించింది. ఇది పూర్తి అయేవరకు, సమర్పించిన SBNల వాస్తవిక సంఖ్య, ఎట్టి అంచనాలు తెలియపరచవు. ఈ ప్రక్రియ శీఘ్రంగా పూర్తి చేసి, సమర్పించబడ్డ SBNల పై ఖచ్చితమైన సంఖ్యలు త్వరలో ప్రచురించడానికి, రిజర్వ్ బ్యాంక్ అన్ని చర్యలు తీసుకొంటున్నది. జోస్ జె. కత్తూర్ పత్రికా ప్రకటన: 2016-2017/1783 |