<font face="mangal" size="3">డిసెంబర్ 30, 2016 తో బ్యాంకులలో స్పెసిఫైడ్ బ్యాంకĺ - ఆర్బిఐ - Reserve Bank of India
డిసెంబర్ 30, 2016 తో బ్యాంకులలో స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (SBN) మార్పిడి పథకం ముగింపు- అకౌంటింగ్
RBI/2016-17/201 డిసెంబర్ 30, 2016 ద ఛైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్ /చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డియర్ సర్, డిసెంబర్ 30, 2016 తో బ్యాంకులలో స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్ల (SBN) మార్పిడి దయచేసి ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 నోట్ల చట్టబద్ధ చలామణి రద్దుపై మేము నవంబర్ 08. 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం. DCM (Plg) No. 1226/10.27.00/2016-17 లోని పేరా 3 (C) ను చూడండి. 2. అన్ని బ్యాంకులలో డిసెంబర్ 30, 2016 న వ్యాపార లావాదేవీలు ముగిసే సమయానికి స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల మార్పిడి సదుపాయం ముగుస్తున్నందున అన్ని బ్యాంకులు తాము సేకరించిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల వివరాలను డిసెంబర్ 30, 2016 నే ఈమెయిల్ ద్వారా తెలియజేయాలి. తదనుగుణంగా బ్యాంకులు అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. 3. అన్ని బ్యాంకుల శాఖలు (DCCBలు తప్ప) డిసెంబర్ 30, 2016న వ్యాపార లావాదేవీలు ముగిసిన అనంతరం అప్పటివరకు తాము సేకరించిన స్పైసిఫైడ్ బ్యాంకు నోట్లను రిజర్వ్ బ్యాంకు యొక్క ఏదైనా ఒక ఇష్యూ ఆఫీసులో కానీ లేదా కరెన్సీ ఛెస్ట్ లో కానీ డిసెంబర్ 31, 2016 నే జమ చేయాలి. 4. డిసెంబర్ 31, 2016న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుంచి స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు క్యాష్ బ్యాలన్స్ లో భాగం కాలేవు. 5. అయితే, DCCBలు మాత్రం అవి నవంబర్ 10 మరియు 14 మధ్య సేకరించిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను తదుపరి ఆదేశాలు అందేంత వరకు తమ వద్దే ఉంచుకోవచ్చు. (ఇందు నిమిత్తమై దయచేసి మేము నవంబర్ 17, 2016న జారీ చేసిన DCM (Plg) No. 1294/10.27.00/2016-17 న జారీ చేసిన సర్క్యులర్ ను గమనించండి) 6. లింక్డ్ బ్యాంకు శాఖలు/ఇతర బ్యాంకుల శాఖలు/పోస్ట్ ఆఫీసుల నుంచి సేకరించిన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను జమ చేసేందుకు కరెన్సీ ఛెస్ట్ లను నిర్వహించే బ్యాంకులు తగిన ఏర్పాట్లను చేసుకోవాలి. రాత్రి 9 గంటల నుంచి డిపాజిట్ల స్వీకరణ మరియు వాటి అకౌంటింగ్ పూర్తయ్యే వరకు అన్ని లావాదేవీలను ICCOMS ద్వారా నివేదించే అవకాశాన్నికల్పిస్తారు. 7. స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లను నిలువ చేసేందుకు కరెన్సీ ఛెస్ట్ లు కలిగిన బ్యాంకులు తమ ప్రస్తుత కరెన్సీ ఛెస్ట్ లోనే అదనపు స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు లేదా అదే సెంటర్ లోని అదనపు నిలువ స్థలాన్ని కరెన్సీ ఛెస్ట్ గా (అది భద్రంగా, సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న అనంతరం) ఉపయోగించుకోవచ్చు. ఇందు నిమిత్తం మేము నవంబర్ 17, 2016 న జారీ చేసిన సర్క్యులర్ DCM (Plg) No. 1294/10.27.00/2016-17 ను చూడండి. 8. దయచేసి అందినట్లు తెలుపగలరు. మీ విశ్వసనీయులు, (పి. విజయ కుమార్) |