RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78468352

జీలాని కమిటీ సిఫారసుల అమలు

RBI/2015-16/383
DBS.CO.PPD.BC.No.10/11.01.005/2015-16

ఏప్రిల్ 28, 2016

చైర్‌మన్‌/ చీఫ్ ఎక్జెక్యూటివ్
అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు
(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా)

అమ్మా/అయ్యా,

జీలాని కమిటీ సిఫారసుల అమలు

బ్యాంకుల్లో మోసాలు/దురాచారాల విషయంలో జీలానీ కమిటీ సిఫారసులపై, మేము జారీ చేసిన సర్క్యులర్, DBS.CO.PPD.BC.No.39/11.01.005/99-2000, జూన్‌ 28, 2000 దయచేసి చూడండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల, ఆడిట్ కమిటీ (ACB) –క్యాలెండర్ ఆఫ్ రివ్యూస్ (Audit Committee of the Board of Directors (ACB) – Calendar of Reviews) జీలాని కమిటీ సిఫారసుల అమలుపై పరిస్థితి ACB కి నివేదించాలని, మేము జారీ చేసిన సర్క్యులర్ DBS.ARS.BC.No.4/08.91.020/2010-11, నవంబర్ 10, 2010 కూడా దయచేసి చూడండి.

2. వివిధ బ్యాంకుల్లో, పై సిఫారసుల అమలు స్థితి సమీక్షించి, ఇకపై జీలానీ కమిటీ సిఫారసుల అమలుపై నివేదిక ACBకి సమర్పించనవసరం లేదని, నిశ్చయించడం జరిగింది. అయితే, బ్యాంకులు ఈ క్రింది విషయాలు రూఢి చేసుకోవాలి:

i) సిఫారసుల అమలు పరిపూర్ణంగా కొనసాగవలెను

ii) ఈ సిఫారసులను, ఇన్‌స్పెక్షన్‌/ఆడిట్ విధానాల్లో ఒక అంశంగా చేసి, వారి మాన్యువల్ /ఆదేశాల్లో వీటిని చేర్చవలెను.

విధేయులు,

(పార్వతి వి సుందరం)
చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్‌-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి