<font face="mangal" size="3">స్వల్పకాలిక పంట రుణాల కోసం తాత్కాలిక ప్రాతĹ - ఆర్బిఐ - Reserve Bank of India
స్వల్పకాలిక పంట రుణాల కోసం తాత్కాలిక ప్రాతిపదికన 2018-19 సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు
ఆర్బిఐ/2017-18/190 జూన్ 7, 2018 అధ్యక్షుడు/కార్యనిర్వాహక సంచాలకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడమ్/సర్ స్వల్పకాలిక పంట రుణాల కోసం తాత్కాలిక ప్రాతిపదికన 2018-19 సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు స్వల్పకాలిక పంట రుణాలు 2017-18 కోసం వడ్డీ రాయితీ పథకం ఫై దయచేసి ఆగష్టు 16, 2017 తేదీ నాటి మా సర్కులర్ FIDD.CO.FSD.BC.No.14 / 05.02.001 /2017-18 చూడండి. దీని ద్వారా 2017-18 సంవత్సరానికి వడ్డీ రాయితీ పథకం కొనసాగించడం మరియు అమలు చేయడం గురించి సలహా ఇవ్వడమైనది. వడ్డీ రాయితీ పథకం 2018-19 గురించి, వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వడ్డీ రాయితీ పథకం 2018-19 కొనసాగింపు ప్రక్రియను ప్రారంభించామని తెలియజేసింది. 2. భారత ప్రభుత్వ సలహా ప్రకారం, మధ్యంతర చర్యగా, పై సర్కులర్లో పేర్కొన్న విధంగా, 2017-18లో పథకం కోసం ఆమోదించబడిన నిబంధనలు మరియు షరతులపై, 2018-19 సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకం తదుపరి ఆదేశాల వరకు అమలు చేయబడుతుంది. తదనుగుణంగా, అన్ని బ్యాంకులు 2018-19 కోసం వడ్డీ రాయితీ పథకాన్నిఅమలు చేయాలని సలహా ఇవ్వడమైనది. 3. ఇంకా, 2018-19 నుండి భారత ప్రభుత్వం సూచించిన విధంగా, ఐఎస్ఎస్ 'ఇన్ కైండ్ / సేవలు', 'నగదు' క్రమము లో కాకుండా, DBT క్రమము లో ఉంచబడుతుంది మరియు 2018-19లో ప్రాసెస్ చేయబడిన అన్ని రుణాలు ISS పోర్టల్/DBT వేదిక పైకి, అది ప్రారంభించబడినప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 4. భారత ప్రభుత్వ లేఖ F.No.1-4/2017-క్రెడిట్-I తేది ఆగష్టు 16, 2017 (ప్రతి జత పర్చబడినది) ప్రకారం, వడ్డీ రాయితీ పథకం, ప్రణాళిక, ప్రణాళిక కాని పథకంగా వర్గీకరణచేయబడదు. దీని ప్రకారం వడ్డీ రాయితీ పథకం, 2018-19, ప్రణాళిక పథకం లో వర్తించే విధంగా షెడ్యూల్డ్ కులము (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టి) మరియు ఈశాన్య ప్రాంతము (నార్త్ ఈస్ట్ రీజియన్-ఎన్ఇఆర్) మొదలైనవిగా నిర్ణయం చేయవలసి ఉంటుంది. 5. కాబట్టి ఈ పథకం క్రింద బ్యాంకులు లబ్దిదారుల సమాచారాన్ని వర్గాల వారీగా అంటే జనరల్, షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టి), ఈశాన్య ప్రాంతము (నార్త్ ఈస్టర్న్ రీజియన్-ఎన్ఇఆర్)-జనరల్, ఈశాన్య ప్రాంతము (నార్త్ ఈస్టర్న్ రీజియన్-ఎన్ఇఆర్)-ఎస్సీ, ఈశాన్య ప్రాంతము (నార్త్ ఈస్టర్న్ రీజియన్-ఎన్ఇఆర్)-ఎస్టిలు గా ISS పోర్టల్లో వ్యక్తిగత రైతు వారీగా 2018-19 నుండి సంభవించే క్లైములను పరిష్కరించడానికి సేకరించాలి. DBT పోర్టల్ అమలు చేసేంతవరకు బ్యాంకులు, పైన పేర్కొన్నట్లుగా వర్గాల వారీగా క్లైములను సమర్పించాలి. 6. రుణాల వర్గీకరణకు సంబంధించిన వివరణాత్మక విధివిధానాలఫై, బ్యాంకు ప్రభుత్వంతో సంప్రదించి పని చేస్తున్నది. అటువంటి వర్గీకరణపూర్తి అయ్యేంతవరకు, బ్యాంకులు స్వీయ-ప్రకటన ఆధారంగా వర్గాల వారీగా సమాచారాన్ని పొందవచ్చు. ఏదేమైనా ప్రతి వర్గానికి చెందిన రుణాలపై ఎటువంటి పరిమితి ఉండదు. మీ విధేయులు, (జి.పి. బోరా) |