<font face="mangal" size="3">కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ప్రూడెన్షి - ఆర్బిఐ - Reserve Bank of India
కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ప్రూడెన్షియల్ నిబంధనల ప్రకారం, ఒత్తిడికిలోనయిన రుణాల పరిష్కారానికి కాలపరిమితులు – సమీక్ష
RBI/2019-20/219 ఏప్రిల్ 17, 2020 అన్ని షెడ్యూల్డ్ (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహా); అన్ని జాతీయ అర్థిక సంస్థలు (నాబార్డ్, NABARD; ఎన్ ఎచ్ బి, NHB; ఇ ఎక్స్ ఐ ఎమ్ బ్యాంక్, EXIM Bank మరియు ఎస్ ఐ డి బి ఐ, SIDBI); వ్యవస్థకు ముఖ్యమైన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (డిపాజిట్లు స్వీకరించని, NBFC-ND-SI); డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర సంస్థలు (NBFC-D) అమ్మా / అయ్యా, కోవిడ్–19 రెగ్యులేటరీ ప్యాకేజ్ – ప్రూడెన్షియల్ నిబంధనల ప్రకారం, ఒత్తిడికిలోనయిన రుణాల పరిష్కారానికి కాలపరిమితులు – సమీక్ష వ్యాపారం, ఆర్థిక సంస్థల సామర్థ్యంపై ఇంకా కొనసాగుతున్న కోవిడ్–19 ప్రభావాన్ని తగ్గించడానికి, ఏప్రిల్ 17, 2020 తేదీన గవర్నర్ ప్రకటించిన అదనపు నియంత్రణ చర్యలను జ్ఞప్తికి తెచ్చుకోండి. బ్యాంకింగ్ పర్యవేక్షణపై, బాజెల్ కమిటీ, ప్రపంచ వ్యాప్తంగా సూచించిన సమన్వయ చర్యలకు అనుసారంగా, ఈ అదనపు నియంత్రణ చర్యలు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా, ప్రూడెన్షియల్ నిబంధనల ప్రకారం, ఒత్తిడికిలోనాయిన రుణాల పరిష్కారానికి కాలపరిమితుల పొడిగిస్తూ జూన్ 7, 2019 తేదీన జారీచేసిన ఆదేశాలు ఈక్రింద వివరించబడ్డాయి: 2. ప్రూడెన్షియల్ నిబంధనలు, పేరాగ్రాఫ్ 11క్రింద బకాయిపడ్డ సంస్థల విషయంలో 30 రోజుల సమీక్షా కాలం ముగిసిన తరువాత 180 రోజులలోగా, ఋణదాతలు పరిష్కార ప్రణాళిక అమలుపరచాలి. 3. ఈ నిబంధన సమీక్షించి, మార్చి 1, 2020 తేదీన, సమీక్షా కాలంనడుస్తూ ఉన్న ఖాతాలకు, మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 వరకు సమీక్షా కాలంగా లెక్కించరాదని నిశ్చయించబడింది. మిగిలిన సమీక్షాకాలం జూన్ 1, 2020 నుండి లెక్కించబడుతుంది. ఈ సమయం తరువాత, పరిష్కారానికి మామూలు 180 రోజుల సమయం ఉంటుంది. 4. సమీక్షా కాలం పూర్తి అయి ఉండి, మార్చి 1, 2020 నాటికి 180 రోజుల పరిష్కార సమయం పూర్తికాని ఖాతాలకు, పరిష్కార సమయం అసలు పూర్తి కావలసినతేదీనుండి, 90 రోజులు పొడిగించబడుతుంది. 5. అందువల్ల, ప్రూడెన్షియల్ నిబంధనలు, పేరాగ్రాఫ్ 17 ప్రకారం అదనపు ప్రొవిషన్ చేయవలసిన సమయం, పైన తెలిపిన విధంగా పొడిగించిన కాలం ముగిసిన తరువాత, మొదలవుతుంది. 6. మిగిలిన అన్ని ఖాతాల విషయంలో, ప్రూడెన్షియల్ నిబంధనలు, ఏ మార్పు లేకుండా వర్తిస్తాయి. 7. పరిష్కార సమయం పొడిగించబడిన ఖాతాల వివరాలు, ఋణ సంస్థలు సెప్టెంబర్ 30, 2020 న ముగిసే అర్థ సంవత్సర ఆర్థిక నివేదికలో మరియు 2020, 2021, ఆర్థిక సంవత్సర నివేదికలలో, ‘నోట్స్ టు అకౌంట్స్’, క్రింద ప్రకటించాలి. మీ విశ్వాసపాత్రులు, (సౌరవ్ సిన్హా) |