<font face="mangal" size="3">వ్యవసాయ రంగానికి ఋణం - ఉచిత అనుషంగిక (కొల్లేట - ఆర్బిఐ - Reserve Bank of India
వ్యవసాయ రంగానికి ఋణం - ఉచిత అనుషంగిక (కొల్లేటరల్) వ్యవసాయ రుణాలు
ఆర్ బి ఐ/2018-19/118 ఫిబ్రవరి 07, 2019 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకుడు/ముఖ్య కార్యనిర్వహణ అధికారి మేడమ్/సర్, వ్యవసాయ రంగానికి ఋణం - ఉచిత అనుషంగిక (కొల్లేటరల్) వ్యవసాయ రుణాలు ఫిబ్రవరి 7, 2019 న విడుదలైన 2018-19 సంవత్సర ఆరవ రెండు-నెలలవారీ ద్రవ్య విధాన అభివృద్ధి మరియు నియంత్రణ విధానాల ప్రకటన యొక్క 13 వ పేరాను చూడండి. 2. ఈ సందర్భంలో, పైన ఉదహరించిన అంశంపై జూన్ 18, 2010 నాటి మా సర్కులర్ ఆర్ పి సి డి. పిఎల్ఎఫ్ఎస్. బిసి. సంఖ్య 85/05.04.02/2009-10 ను చూడండి. 3. 2010 సంవత్సరం నుండి, మొత్తం ద్రవ్యోల్బణం మరియు వ్యవసాయ సంబంధిత వ్యయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ఉచిత అనుషంగిక వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుతమున్న ₹ 1 లక్ష నుండి ₹ 1.6 లక్షలకు పెంచాలని నిర్ణయించడమైనది. దీని ప్రకారం, వ్యవసాయ రుణాల మార్జిన్ అవసరాలను బ్యాంకులు ₹ 1.6 లక్షల వరకు వదులుకోవచ్చు. 4. ఈ రుణాల లోని మార్పుకు తగిన ప్రచారం ఇవ్వాలని మరియు మీ నియంత్రణ కార్యాలయాలు/శాఖల ద్వారా, తక్షణమే అమలుకు నిర్దేశించాలని అభ్యర్ధించమైనది. 5. దయచేసి ప్రాప్తిని తెలియజేయండి. మీ విధేయులు, (సోనాలి సేన్ గుప్తా) |