<font face="mangal" size="3">ప్ర‌స్తుత రూ.500 మ‌రియు రూ.1000 బ్యాంకు నోట్ల చ‌ట్ట&zwn - ఆర్బిఐ - Reserve Bank of India
ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - రోజువారీ నివేదికలు
RBI/2016-17/136 నవంబర్ 16, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, ప్రస్తుత రూ.500 మరియు రూ.1000 బ్యాంకు నోట్ల చట్టబద్ధ చలామణి లక్షణం రద్దు - రోజువారీ నివేదికలు దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన DCM CO సర్క్యులర్ నెం. DCM (Plg) No. 1226/10.27.00/2016-17 లోని పేరా (4) ప్రకారం స్పెసిఫైఢ్ బ్యాంకు నోట్ల (SBN) వివరాలన్నీ RBIకు రోజువారీ నివేదికల రూపంలో పంపాలన్న సూచనను గమనించండి. అయితే బ్యాంకులు ఆ నివేదికలను ఆలస్యంగా పంపుతున్నాయని గుర్తించడం జరిగింది. దీని వల్ల RBIలో ఆ డాటాను సంకలనం చేయడానికి మరియు ఒక చోటికి చేర్చడానికి చాలా అసౌకర్యం కలుగుతోంది. 2. అందువల్ల బ్యాంకులు తమ రోజువారీ డాటాను Annex 6A లో ప్రతిరోజు రాత్రి 2300 గంటలోగా ఈమెయిల్ ద్వారా RBI, DCM, COకు పంపాలని విజ్ఞప్తి. మీ విశ్వసనీయులు, (సుమన్ రే) |