<font face="mangal" size="3">బ్యాంకులు డివిడెండ్లు ప్రకటించటం</font> - ఆర్‌బిఐ - Reserve Bank of India
బ్యాంకులు డివిడెండ్లు ప్రకటించటం
ఆర్‌బిఐ/2020-21/75 డిసెంబర్ 04, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు మరియు అన్ని సహకార బ్యాంకులు. మేడమ్/డియర్ సర్, బ్యాంకులు డివిడెండ్లు ప్రకటించటం పైన ఉటంకించిన విషయం మీద ఏప్రిల్ 17, 2020 నాటి మా సర్క్యులర్ DOR.BP.BC.No.64/21.02.067/2019-20, ను పరికించండి. 2. కోవిడ్–19 సందర్భంగా ఎదురైన అనిశ్చిత పరిస్థితులు మరియు కొనసాగుతున్న ఒత్తిడి దృష్ట్యా; ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి, నష్టాలు ఎదురైతే భరించడడం కోసం బ్యాంకులు, వారి మూలధనాన్ని పరిరక్షించుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను మరింత బలోపేతం చేయడానికి, అదే విధంగా వాస్తవిక ఆర్ధిక వ్యవస్థకు రుణరూపేణా మద్దతు దృష్ట్యా, మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరం సంబంధిత లాభాల నుండి ఈక్విటీ షేర్లపై బ్యాంకులు ఎటువంటి డివిడెండ్ చెల్లింపు ను చేయరాదని నిర్ణయించబడింది. మీ విధేయులు, (ఉషా జానకిరామన్) |