<font face="Mangal" size="3px">దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవన - ఆర్బిఐ - Reserve Bank of India
దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం – [National Rural Livelihoods Mission (DAY-NRLM) – ఆజీవిక–వడ్డీ పై రాయితీ సహాయ పథకం- (Aajeevika-Interest Subvention Scheme)
ఆర్బిఐ/2017-18/80 అక్టోబర్ 18, 2017 అధ్యక్షుడు/నిర్వాహక సంచాలకులు మాడమ్/డియర్ సర్, దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (National Rural Livelihoods Mission (DAY-NRLM) క్రింద వడ్డీ పై రాయితీ పథకం గురించి, మాచే ఆగస్టు 25, 2016 తేదీన జారీ చేయబడ్డ సర్క్యులర్ FIDD.GSSD.CO.BC.NO.13/09.01.03/2016-176 ను దయచేసి చూడండి. 2. 2017-18 సంవత్సరంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (DAY-NRLM) క్రింద వడ్డీ పై రాయితీ సహాయం అందించడానికి భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే సవరించబడిన మార్గదర్శకాలు దీనితో జతచేయబడినవి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు (జాబితా జతచేయ డినది) ఈ మార్గదర్శకాలను పాటించవలెను. గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు గురుంచిన సర్కులర్ నాబార్డ్ (NABARD) జారీ చేస్తుంది. మీ విధేయులు, (అజయ్ కుమార్ మిశ్రా) మహిళా స్వయం సహాయక బృందాలకు వడ్డీ పై రాయితీ సహాయ పథకం - 2017-18 I. 2017-18 సంవత్సరానికి 250 జిల్లాలలో మహిళా స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ సహాయ పథకం, అనుబంధం I ప్రకారం గా ఉంటుంది i. అన్ని మహిళా స్వయం సహాయక బృందాలు సంవత్సరానికి 7% వడ్డీ తో ₹ 3 లక్షల వరకు రుణాలపై వడ్డీ రాయితీకి అర్హులు. SGSY కింద మూలధన రాయితీని పొందుతున్న మహిళా స్వయం సహాయక బృందాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందటానికి అర్హులు కావు. ii. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక బృందాలకు బ్యాంకులు 7% వడ్డీ తో రుణాలు మంజూరు చెయ్యాలి. iii. సాధారణంగా వసూలు చేయబడే సగటు వడ్డీ రేటుకూ, 7% కి మధ్యగల వ్యత్యాసం మేరకు, [Weighted Average Interest Charged-WAIC (ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం 2017-2018 సంవత్సరానికి సూచించిన WAIC ఆధారంగా- అనుబంధం II)] గరిష్ఠ పరిమితి 5.5% కు లోబడి, బ్యాంకులకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది. ఈ ఆర్థిక సహాయం 7% వడ్డీకి బ్యాంకులు మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలు జారీ చేసినప్పుడు మాత్రమే లభిస్తుంది. iv. ఇంతేగాక, సకాలంలో తిరిగి చెల్లించిన రుణాలపై, అదనంగా మరో 3% సహాయం లభిస్తుంది. ఒక స్వయం సహాయక బృందం సకాలంలో రుణం తిరిగి చెల్లించింది అనడానికి భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) విధించిన ఈ క్రింది ప్రమాణాలు పాటించినదై ఉండాలి. a. నగదు రుణాల పరిమితి (Cash Credit Limit) కొరకు:
b. నిర్ణీతకాల రుణాల (for Term Loans) కొరకు: వడ్డీ మరియు/లేక అసలు వాయిదాలు, గడువుతేదీ పూర్తి అయిన 30 రోజుల లోపు చెల్లించబడితే, అట్టి రుణాలు సకాలంలో చెల్లించబడినట్లు పరిగణించబడతాయి. v. సకాల చెల్లింపులపై భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు, భవిష్యత్తులో కూడా అమలులో ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరిపిన మహిళా స్వయం సహాయక బృందాల ఖాతాలు, రిపోర్టింగ్ త్రైమాసికం పూర్తయిన తరువాత, వడ్డీపై 3% అదనపు రాయితీ సహాయానికి అర్హులౌతాయి. ఈ మొత్తాన్ని బ్యాంకులు ముందు మహిళా స్వయం సహాయక బృందాల ఖాతాల లో జమచేసి, ఆ తరువాత చెల్లింపు పొందవచ్చు. vi. ఈ పథకం, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా స్వయం సహాయక బృందాలకు మాత్రమే పరిమితం. vii. ఈ పథకానికి ఆర్థిక సహాయం, జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (DAY-NRLM) కొరకై కేంద్రం కేటాయించిన నిధుల నుండి సమకూర్చబడుతుంది. viii. వడ్డీ పై రాయితీ సహాయ పథకం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD) ఎంపికచేసిన నోడల్ బ్యాంక్ ద్వారా అమలుచేయబడుతుంది. నోడల్ బ్యాంక్, MoRD సూచించిన విధంగా అంతర్జాల 'వెబ్ ప్రోగ్రాం' ద్వారా ఈ పథకం అమలు చేస్తుంది. 2017-18 సంవత్సరానికి నోడల్ బ్యాంకుగా, కెనరా బ్యాంకును MoRD ఎంపికచేసింది. ix. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ [Core Banking solutions, (CBS)] నిర్వహిస్తున్న అన్ని బ్యాంకులు, వడ్డీపై రాయితీ సహాయ పధకానికి అర్హులు. x. మహిళా స్వయం సహాయక బృందాలకు 7% వడ్డీపై జారీ చేసిన రుణాలపై వడ్డీ రాయితీ సహాయం పొందడానికి, మహిళా స్వయం సహాయక బృందాల యొక్క రుణ వివరాలను బ్యాంకులు, నోడల్ బ్యాంక్ పోర్టల్‌లో వారు సూచించిన సాంకేతిక ప్రమాణాలను అనుసరించి, అప్‌లోడ్ చెయ్యాలి. 3% అదనపు సహాయం కూడా అదే పోర్టల్ ద్వారా క్లైమ్ చెయ్యాలి. ములు (WAIC లేదా రుణాల రేటు కి 7% కి మధ్యగల వ్యత్యాసం) మరియు అదనపు ములు (సకాల చెల్లింపులపై 3%), త్రైమాసిక కాల అవధుల్లో (జూన్ 30, 2017, సెప్టెంబర్ 30, 2017, డిసెంబర్ 31, 2017 మరియు మార్చ్ 31, 2018), తదుపరి నెల ఆఖరి వారంలో మ్ చెయ్యాలి. xi. బ్యాంకులు సమర్పించిన క్లైములతోబాటు, క్లైమ్ నిజమైనది, సరైనది అని ధృవ పత్రపు అసలు, జతచేయాలి. (అనుబంధం III & IV). మార్చ్ 2018 త్రైమాసపు క్లైమ్, 2017-18 ఆర్థిక సంవత్సరానికి స్టాట్యూటరీ ఆడిటర్ సర్టిఫికేట్ సమర్పించిన తరువాతే చెల్లించబడుతుంది. xii. బ్యాంకులు, 2017-18 సం.లో చేసిన చెల్లింపులు ఆ సంవత్సరంలో క్లైమ్ చేయనట్లయితే, అటువంటి క్లైమ్‌లు అన్నీ కలిపి 'అడిషనల్ క్లైమ్' అని సూచిస్తూ, స్టాట్యూటరీ ఆడిటర్ సర్టిఫికేట్‌తోబాటు, జూన్ 30, 2018 లోగా నోడల్ బ్యాంకుకు సమర్పించాలి. మార్చ్ ౩౦, 2018 తరువాత, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎలాంటి వడ్డీ రాయితీ క్లైములు అనుమతించబడవు. xiii. బ్యాంకులు చేసిన క్లైమ్‌లో ఏవేని సవరణలు ఉంటే, అవి ఆడిటర్ సర్టిఫికేట్ ఆధారంగా, తరువాతి క్లైముల నుండి సర్దుబాటు చేయబడతాయి. బ్యాంకులు, అవసరమైన సవరణలను, నోడల్ బ్యాంక్ పోర్టల్ ద్వారా మాత్రమే చేయవలెను. II. వడ్డీపై రాయితీ సహాయ పథకం – శ్రేణి II జిల్లాలకొరకు (పైన పేర్కొనబడిన 250 జిల్లాలు మినహాయించి) పైన పేర్కొనబడిన 250 జిల్లాలు మినహాయించి, ఇతర శ్రేణి II జిల్లాలలోని మహిళా స్వయం సహాయక బృందాలు కూడా DAY-NRLM క్రింద 7% వడ్డీపై రుణాలు పొందటానికి అర్హులు. ఈ సహాయం, DAY-NRLM క్రింద కేటాయించిన నిధులనుండి, రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి వ్యవస్థల ద్వారా (SRLMs) అందచేయబడుతుంది. శ్రేణి II జిల్లాలలోని బ్యాంకులు SHGల నుండి, వారి రుణ నిబంధలను అనుసరించి వడ్డీ వసూలు చేస్తాయి. అయితే ఈ వడ్డీరేటుకూ, 7% మధ్యగల వ్యత్యాసం, SRLM, ద్వారా SHGల ఖాతాల్లో జమ చేయ బడుతుంది. (2017-18 ఆర్థిక సంవత్సరానికి గరిష్ఠ పరిమితి 5.5%). తదనుసారంగా, శ్రేణి II జిల్లాలకు, వడ్డీపై రాయితీ సహాయానికి వర్తించే మారదర్శకాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: (A) బ్యాంకుల పాత్ర: కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (CBS) నిర్వహిస్తున్న అన్ని బ్యాంకులు, MoRD సూచించిన నమూనాలో, నేరుగా MoRD కి (FTP లేక ఇంటర్ఫేస్ ద్వారా), SRLM లకు, వారి వారి జిల్లాల్లో SHG లకు మంజూరు చేసిన రుణాలు, బకాయిలకు సంబంధించిన అన్ని వివరాలూ తెలియచెయ్యాలి. SHGలకు, వడ్డీ పై రాయితీ సహాయం చెల్లించడానికి వీలుగా, ఈ వివరాలు నెలవారీగా సమర్పించాలి. (B) రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర: i. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అన్ని మహిళా స్వయం సహాయక బృందాలు (మహిళా SHGs), DAY-NRLM క్రింద, స్వయం సహాయక బృందాలు (SHGs) గా పరిగణించబడతాయి. రుణాలు సకాలంలో చెల్లిస్తే, ` 3 లక్షలవరకు రుణం 7% వడ్డీకే మరియు వడ్డీ పై రాయితీ సహాయం పొందడానికి అర్హులౌతాయి. ii. ఈ పథకం రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి వ్యవస్థలద్వారా (SRLMs) ద్వారా నిర్వహించబడుతుంది. అర్హులైన SHGలకు, బ్యాంకులనుండి పొందిన రుణంపై చెల్లించవలసిన వడ్డీపై రాయితీ సహాయం అందించబడుతుంది. దీనికై నిధులు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయానుసారం, కేంద్రంచేసిన కేటాయింపుల నుండి, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా ఇచ్చిన నిధులనుండి సమకూర్చబడతాయి. iii. బ్యాంకులు వసూలుచేసిన వడ్డీకి, 7% కి మధ్యగల వ్యత్యాసాన్ని (2017-18 లో, గరిష్ఠంగా 5.5%) SRLMs నేరుగా నెల/త్రైమాసిక వ్యవధుల్లో, SHGలకు రాయితీగా చెల్లిస్తాయి. సకాలంలో రుణం తిరిగి చెల్లించిన SHGల ఖాతాలకు ఈ సొమ్ము SRLMs చే, ఇ-ట్రాన్స్ఫర్ (e-transfer) ద్వారా జమచేయబడుతుంది. రుణ ఖాతా ఇప్పటికే మూసివేయబడితే లేదా రుణ ఖాతాకు ఇ-ట్రాన్స్ఫర్ ఏ కారణం చేతైనా విజయవంతం కానట్లయితే, రాయితీ మొత్తాన్ని ఆ SHG యొక్క సంబంధిత పొదుపు ఖాతాకు బదిలీ చేయవచ్చు. iv. సకాలంలో రుణం తిరిగి చెల్లించింది అనడానికి భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) విధించిన ఈ క్రింది ప్రమాణాలు నెరవేర్చి ఉండాలి: a. నగదు రుణాల పరిమితి (Cash Credit Limit) కొరకు:
b. నిర్ణీతకాల రుణాల (for Term Loans) కొరకు: వడ్డీ మరియు/లేక అసలు వాయిదాలు, గడువుతేదీ పూర్తి అయిన 30 రోజుల లోపు చెల్లించబడితే, అట్టి రుణాలు సకాలంలో చెల్లించబడినట్లు పరిగణించబడతాయి. ఇకపైకూడా, సకాల చెల్లింపులపై భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. v. ఎస్ జి ఎస్వై (SGSY) కింద ఉన్న మూలధన రాయితీని తమ ప్రస్తుత రుణాలలో పొందిన మహిళా స్వయం సహాయక బృందాలు, ఈ పథకం కింద తమ సబ్సిస్టెంట్ రుణాల కోసం వడ్డీ రాయితీ ప్రయోజనానికి అర్హత పొందవు. vi. వడ్డీ ఫై రాయితీ కి సంబంధించి, అర్హత కలిగిన స్వయం సహాయక బృందాల రుణ ఖాతాలకు బదిలీ చేయబడిన వివరాల తో కూడిన త్రైమాసిక వినియోగ ధ్రువీకరణ పత్రం, SRLMs లు సమర్పించాలి. III. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MoRD), రాష్ట్ర ప్రభుత్వా సంప్రదింపుల ద్వారా వడ్డీ పై రాయితీ సహాయానికి ప్రత్యేకమైన పథకాలున్న రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను, కేంద్ర పథకంతో సమన్వయించవలసి ఉంటుంది. |