RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78517510

శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ఫై నిర్దేశాలు – కాలపరిమితి పొడిగింపు

తేది: 25/10/2019

శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే,
మహారాష్ట్ర ఫై నిర్దేశాలు –
కాలపరిమితి పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంకు మే 03, 2019 నాటి ఆదేశం ద్వారా శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ను మే 04, 2019 పని వేళల ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచింది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ఫై విధించిన ఫై నిర్దేశాలు అక్టోబర్ 18, 2019 నాటి ఆదేశం ద్వారా, మే 04, 2020 వరకు సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది.

నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది.

పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/1029

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?