<font face="mangal" size="3">ది శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిట - ఆర్బిఐ - Reserve Bank of India
ది శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర కు నిర్దేశాల జారీ - కాలపరిమితి పొడిగింపు
మే 1, 2020 ది శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిటెడ్, పూణే, ది శివాజీ రావు భోంస్లే సహకారి బ్యాంక్ లిమిటెడ్, పూణే, మే 04, 2019 తేదీ పనివేళల ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నిర్దేశాల (డిసిబియస్.సిఓ.బియస్డి.I/డి-14/12.22.254/2018-19 మే 03, 2019 తేదీ నాటి ఆదేశం ద్వారా) క్రింద ఉంచబడింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 56తో కలిపి, సబ్-సెక్షన్ (1), సెక్షన్ 35 ఎ క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, ఏప్రిల్ 24, 2020 తారీఖు నాటి ఆదేశం డిఓఆర్.సిఓ.ఏఐడి/డి-77/12.22.254/2019-20 ద్వారా పైన తెలిపిన విధంగా విధించిన నిర్దేశాలు ఆగస్ట్ 04, 2020 తేదీ వరకు బ్యాంక్ కు చెల్లుబాటు అయ్యేలా సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా జనావళికి సమాచారం తెలియజేయడమైనది. 3. నిర్దేశాల పొడిగింపును తెలిపే పై ఆదేశం నకలు, ఆసక్తిగల ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది. 4. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశం పొడిగింపు మరియు / లేదా సవరణ ను బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా యున్నదని అన్యధా పరిగణించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/2301 |