RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524154

శివమ్‌ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్రకు
జారీచేసిన నిర్దేశాల పొడిగింపు

తేది: 20/05/2019

శివమ్‌ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్రకు
జారీచేసిన నిర్దేశాల పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మే 18, 2018 తేదీన జారీచేసిన ఆదేశాల ద్వారా, శివమ్‌ సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్‌కరంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర, మే 19, 2018 పనివేళల ముగింపు సమయంనుండి నిర్దేశాల పరిధిలోనికి తేబడినది.

రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్‌ 35 A, సబ్-సెక్షన్‌ (1) (సెక్షన్‌ 56 తో కలిపి) ద్వారా వారికి దఖలుపరచబడిన అధికారాలతో, పైన పేర్కొన్న నిర్దేశాలు మరొక మూడు నెలలపాటు, అనగా ఆగస్ట్ 19, 2019 వరకు కొనసాగవలెనని, మే 13, 2019 తేదీన ఆదేశాలు జారీచేసినదని ఇందుమూలముగా ప్రజలకు తెలియజేయడమైనది.

కాల పరిమితి పొడిగిస్తూ జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకొరకు, శివమ్‌ సహకారి బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శింపబడినది.

రిజర్వ్ బ్యాంక్, పైన తెలిపిన పొడిగింపు /లేదా మార్పు చేసినందువల్ల, బ్యాంకుయొక్క ఆర్థికస్థితిగురించి రిజర్వ్ బ్యాంక్ సంతృప్తిచెందినదని భావించరాదు.

ఎన్‌. షన్ముగరామ్‌
అసిస్టెంట్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2018-2019/2718

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?