<font face="mangal" size="3">శివమ్ సహకారి బ్యాంకు లిమిటెడ్, ఇచల్కారంజీ, జ&# - ఆర్‌బిఐ - Reserve Bank of India
శివమ్ సహకారి బ్యాంకు లిమిటెడ్, ఇచల్కారంజీ, జిల్లా కొల్హాపూర్, మహారాష్ట్ర ఫై నిర్దేశాలు – కాల పరిమితి పొడిగింపు
తేదీ: 17/10/2019 శివమ్ సహకారి బ్యాంకు లిమిటెడ్, ఇచల్కారంజీ, జిల్లా కొల్హాపూర్, మహారాష్ట్ర ఫై మే 18, 2018 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-6/12.22.351/2017-18 ద్వారా శివమ్ సహకారి బ్యాంకు లిమిటెడ్., ఇచల్కారంజీ, జిల్లా కొల్హాపూర్, మహారాష్ట్ర ను మే 19, 2018 పని వేళల ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశాల క్రింద ఉంచింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 35A యొక్క సబ్ సెక్షన్ (1) క్రింద సమకూరిన అధికారాల క్రింద ఫై నిర్దేశాలు అక్టోబర్ 15, 2019 నాటి DCBR.CO.AID/D-29/12.22.351/2019-20 ఆదేశం ద్వారా మరో ఆరు నెలల కాలానికి నవంబర్ 30, 2019 వరకు సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది. నిర్దేశాల యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో, ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. జారీ చేయబడిన ఫై నిర్దేశాలను, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యగా భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/976 |