<font face="mangal" size="3px">ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాం - ఆర్బిఐ - Reserve Bank of India
ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర కు నిర్దేశాల జారీ - అవధి పొడిగింపు
నవంబర్ 29, 2019 ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ ది శివం సహకారి బ్యాంక్ లిమిటెడ్, ఇచ్హల్కరాంజి, కొల్హాపూర్ జిల్లా, మహారాష్ట్ర ను, మే 19, 2018 తారిఖు పనిముగింపు వేళల నుండి భారతీయ రిజర్వు బ్యాంకు తమ నిర్దేశాల (డిసిబియస్.సిఓ.బియస్డి.I/డి-6/12.22.351/2017-18 మే 18, 2018 వ తెదీ నాటి నిర్దేశం ద్వారా) క్రిందకు తీసుకువచ్చింది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు ప్రజల సమాచారంకోసం తెలియజేయునది యేమనగా పైన పేర్కొనబడిన నిర్దేశం వర్తింపు జనవరి 31, 2020 వ తేదీ వరకు కొనసాగుతుందని; సమీక్షకు లోబడి తమ డైరెక్టివ్ నం. డిఓఆర్.సిఓ.ఏఐడి/డి-41/12.22.351/2019-20 తేదీ నవంబర్ 28, 2019 ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారని. 3. పైన పేర్కొనబడిన గడువు పొడిగింపు నిర్దేశం నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది. 4. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1301 |