<font face="mangal" size="3">ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారా - ఆర్బిఐ - Reserve Bank of India
ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు- కాలపరిమితి పొడిగింపు
తేదీ: 30/01/2020 ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 ది కపోల్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర, మార్చ్ 30, 2017 పనివేళలు ముగింపు నుండి భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా నిర్దేశాల క్రింద ఉంచబడింది (మార్చ్ 30, 2017 నాటి ఆదేశం DCBS.CO.BSD-I./D-9/12.22.111/2016-17 ప్రకారం). 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, జనవరి 29, 2020 నాటి ఆదేశం DOR.CO.AID./No.D-53/12.22.111/2019-20 ద్వారా పైన తెలిపిన విధంగా విధించిన నిర్దేశాలు జులై 31, 2020 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా తెలియచేయడమైనది. 3. నిర్దేశాల పొడిగింపును తెలిపే పై ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితి పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1830 |