RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507069

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 35A, క్రింద ఆదేశాలు - గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., జాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్‌ – కాలపరిమితి పొడిగింపు

తేదీ: జులై 11, 2018

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్‌ 35A, క్రింద ఆదేశాలు
- గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., జాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్‌ – కాలపరిమితి పొడిగింపు

రిజర్వ్ బ్యాంక్, గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., జాన్‌పూర్‌కు (ఉత్తర్ ప్రదేశ్) జారీచేసిన ఆదేశాలు మరొక నాలుగు నెలలు, అనగా జులై 11, 2018 నుండి నవంబర్ 10, 2018 వరకు పొడిగించబడ్డాయి. ఇవి సమీక్షించవచ్చు. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) సెక్షన్‌ 35 A క్రింద, జులై 03, 2017న జారీ చేసిన ఆదేశాలద్వారా, జులై 10, 2017 పనివేళల ముగింపు సమయం నుండి బ్యాంక్, నిర్దేశాల పరిధిలో ఉన్నది.

జనవరి 08, 2018 తేదీన జారీ చేసిన ఆదేశాలద్వారా చివరిసారి జులై 10, 2018 వరకు మార్చబడిన/పొడిగించబడిన నిర్దేశాలు, జూన్‌ 26, 2018 తేది ఆదేశాల ద్వారా మరొక నాలుగు నెలలు (జులై 11, 2018 నుండి నవంబర్ 10, 2018 వరకు, సమీక్షకు లోబడి) పొడిగించబడ్డాయి. పైన పేర్కొన్న ఆదేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఏ మార్పూ లేదు.

జూన్‌ 26, 2018 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, ప్రజల సమాచారంకొరకు, గోమ్‌తీ నగరియా సహకారి బ్యాంక్ లి., ఆవరణలో ప్రదర్శించబడినది.

రిజర్వ్ బ్యాంక్, నిర్దేశాల కాలపరిమితి పొడిగించినంత మాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక స్థితి మెరుగుపడిందనిగాని లేక దిగజారిందనిగాని, భావించరాదు. పరిస్థితులకు అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్, ఈ ఆదేశాలలో మార్పులుచేయవచ్చు.

అజిత్ ప్రసాద్
అసిస్టెంట్ అడ్వైజర్

పత్రికా ప్రకటన: 2018-2019/102

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?