RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78530821

యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కొల్హాపూర్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్‌ 35 A క్రింద నిర్దేశాలు

తేదీ: 01/07/2020

యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కొల్హాపూర్, మహారాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949, సెక్షన్‌ 35 A క్రింద నిర్దేశాలు

జనవరి 04, 2019 తేదీ జారీచేసిన DCBS.CO.BSD-I/D-06/12.22.311/2018-19 ఆదేశాలద్వారా, యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కొల్హాపూర్, మహారాష్ట్ర , జనవరి 05, 2019 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించడం జరిగింది. జనవరి 01, 2020 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం DOR.CO.AID/D-46/12.22.311/2019-20 ద్వారా, జులై 05, 2020 వరకు సమీక్షకులోబడి, గడువు పొడిగించబడింది.

2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56తో కలిపి), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న బ్యాంకుకు జనవరి 04, 2019 తేదీ DCBS.CO.BSD-1/D-06/12.22.311/2018-19 ద్వారా జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి జులై 05, 2020 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక ఆరు నెలలు (అనగా జులై 06, 2020 నుండి జనవరి 05, 2021 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, జూన్ 29, 2020 తేదీన జారీచేసిన DOR.CO.AID/No.D-93/12.22.311/2019-20, ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించవచ్చు. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు.

3. కాలపరిమితి పెంచుతూ, జూన్ 29,2020 తేదీన జారీచేసిన ఆదేశాల ప్రతి, యూత్ డెవెలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., కొల్హాపూర్, మహారాష్ట్ర ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.

4. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/4

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?