<font face="mangal" size="3">సెక్షన్ 56 తో పాటు సెక్షన్ 35ఎ, బ్యాంకింగ్ నియంత్ - ఆర్బిఐ - Reserve Bank of India
సెక్షన్ 56 తో పాటు సెక్షన్ 35ఎ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) క్రింద సికార్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సికార్, రాజస్తాన్, ఫై ఆర్.బి.ఐ. ఆదేశాలు – చెల్లుబడి పొడిగింపు
నవంబర్ 08, 2019 సెక్షన్ 56 తో పాటు సెక్షన్ 35ఎ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) క్రింద సికార్ సికార్, రాజస్తాన్ లోని సికార్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ను అక్టోబర్ 26, 2018 తారీఖున జారీ చేసిన ఆదేశాలను అనుసరించి నవంబర్ 09, 2018 తారీఖు వ్యాపార లావాదేవీలు ముగింపు సమయం నుండి ఆరు నెలలపాటు సమీక్ష కు లోబడి, ఆర్.బి.ఐ. ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. ఈ అదేశాల చెల్లుబడి ఇతఃపూర్వం మే 02, 2019 తారీఖు నాటి డైరెక్టివ్ ద్వారా మరో ఆరు మాసాలు నవంబర్ 09, 2019 తారీఖు వరకు సమీక్షకు లోబడి పొడిగింపబడింది. ప్రజల సమాచారంకోసం ప్రకటన చేసేదేమనగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు పైన పేర్కొన్న బ్యాంక్ కు జారీచేసిన అక్టోబర్ 26, 2018 తారీఖు డైరెక్టివ్ చెల్లుబాటు నవంబర్ 09, 2019 వరకు కొనసాగింపబడి, మరో ఆరు నెలల పాటు అంటే నవంబర్ 10, 2019 నుండి మే 09, 2020 తారీఖు వరకు సమీక్షకు లోబడి ఆ బ్యాంకుకు వర్తిస్తుందని; తమ అక్టోబర్ 30, 2019 తారీఖు నాటి డైరెక్టివ్ ద్వారా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నారు. పైన ఉల్లేఖించిన డైరెక్టివ్ లోని అన్ని ఇతర షరతులు మరియు నిబంధనలలో ఎటువంటి మార్పు లేదు. అక్టోబర్ 30, 2019 తారీఖు గడువు పొడిగింపు ఆదేశం నకలును ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ పరిసరాలలో ప్రదర్శించటం జరిగింది. పై ఆదేశాలను రిజర్వు బ్యాంకు జారీ చేయడాన్ని బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్స్ ను రద్దుచేయడం గా భావించరాదు. బ్యాంక్ తన బ్యాంకింగ్ బిజినెస్ ను, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడేoతవరకు, నిబంధనలమేరకు నిర్వహిస్తారు. పరిస్థితులను బట్టి రిజర్వు బ్యాంకు ఈ ఆదేశాలలో మార్పు చేసే అవకాశాన్నిపరిశీలించవచ్చును. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1146 |