<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షనĺ - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద నిర్దేశాలు – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర
ఫిబ్రవరి 28, 2020 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ పూణే, మహారాష్ట్ర లోని రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఫిబ్రవరి 21, 2013 తేదీ నాటి ఆదేశం UBD/CO.BSD-I/D-28/12.22.218/2012-13 ద్వారా, ఫిబ్రవరి 22, 2013 తేదీ పనివేళల ముగింపు నుండి ఆర్బీఐ నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ నిర్దేశం వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి ఆదేశాల ద్వారా పొడిగించబడి, క్రితం పర్యాయం నవంబర్ 20, 2019 తేదీ నాటి ఆదేశం DOR.AID/D-40/12.22.218/2019-20 మూలంగా, ఫిబ్రవరి 29, 2020 తేదీ వరకు సమీక్షకు లోబడి చెల్లుబాటు అవుతున్నది. 2. జనావళి సమాచారం నిమిత్తం తెలియజేయడం ఏమిటంటే - భారతీయ రిజర్వు బ్యాంకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 ఎ (1) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో పైన పేర్కొనబడిన బ్యాంక్ కు ఫిబ్రవరి 21, 2013 తేదీ న జారీచేసిన డైరెక్టివ్ UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13 చెల్లుబాటు, ఎప్పటికప్పుడు పొడిగింపబడుతూ ఇంతకుముందు ఫిబ్రవరి 29, 2020 వరకు పొడిగింపబడి, మరో మూడు నెలలబాటు మార్చి 01, 2020 నుండి మే 31, 2020 వరకు వర్తింపు కొనసాగుతుందని, సమీక్షకు లోబడి ఫిబ్రవరి 26, 2020 తేదీ డైరెక్టివ్ DOR.AID/D-57/12.22.218/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారు. ఉటంకించిన ఆదేశాలలోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు. 3. ఫిబ్రవరి 26, 2020 తేదీ నాటి పొడిగింపు ఆదేశం నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది. 4. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశాల పొడిగింపు మరియు / లేదా సవరణ ను, బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా అన్యధా పరిగణించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/2003 |