RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514991

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద నిర్దేశాలు – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర

మే 28, 2020

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ
క్రింద నిర్దేశాలు – రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర

పూణే, మహారాష్ట్ర లోని రుపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఫిబ్రవరి 21, 2013 తేదీ నాటి ఆదేశం UBD/CO.BSD-I/D-28/12.22.218/2012-13 ద్వారా, ఫిబ్రవరి 22, 2013 తేదీ పనివేళల ముగింపు నుండి ఆర్బీఐ నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ నిర్దేశం వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి ఆదేశాల ద్వారా పొడిగించబడి, క్రితం పర్యాయం ఫిబ్రవరి 26, 2020 తేదీ నాటి ఆదేశం DOR.AID/D-57/12.22.218/2019-20 మూలంగా, మే 31, 2020 తేదీ వరకు సమీక్షకు లోబడి చెల్లుబాటు అవుతున్నది.

2. జనావళి సమాచారం నిమిత్తం తెలియజేయడం ఏమిటంటే - భారతీయ రిజర్వు బ్యాంకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35 ఎ (1) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో పైన పేర్కొనబడిన బ్యాంక్ కు ఫిబ్రవరి 21, 2013 తేదీ న జారీచేసిన డైరెక్టివ్ UBD.CO.BSD-I/D-28/12.22.218/2012-13 చెల్లుబాటు, ఎప్పటికప్పుడు పొడిగింపబడుతూ ఇంతకుముందు మే 31, 2020 వరకు పొడిగింపబడి, మరో మూడు నెలలబాటు జూన్ 01, 2020 నుండి ఆగస్ట్ 31, 2020 వరకు, వర్తింపు కొనసాగుతుందని, సమీక్షకు లోబడి మే 26, 2020 తేదీ నాటి డైరెక్టివ్ DOR.AID/D-82/12.22.218/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశించారు. ఉటంకించిన ఆదేశాలలోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు.

3. మే 26, 2020 తేదీ నాటి పొడిగింపు ఆదేశం నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది.

4. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశాల పొడిగింపు మరియు / లేదా సవరణ ను, బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా అన్యధా పరిగణించరాదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/2414

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?