<font face="mangal" size="3">శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్,  - ఆర్బిఐ - Reserve Bank of India
శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే,
మహారాష్ట్ర ఫై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార
సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35A, క్రింద నిర్దేశాలు –
కాలపరిమితి పొడిగింపు
తేది: 04/12/2020 శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే, భారతీయ రిజర్వు బ్యాంకు మే 03, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-14/12.22.254/2018-19 ద్వారా శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ను మే 04, 2019 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచింది. అట్టి నిర్దేశాల కాలపరిమితి చివరిగా సెప్టెంబర్ 30, 2020 నాటి ఆదేశం DOR.CO.AID./No. D-24/12.22.254/2020-21 ద్వారా డిసెంబర్ 04, 2020 వరకు పొడిగింపబడినది. 2. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది) సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 35A (1) క్రింద ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, మే 03, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-14/12.22.254/2018-19 ద్వారా శివాజీ రావు భోంస్లే సహకార బ్యాంకు లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర ఫై మే 04, 2019 పని వేళల ముగింపు నుండి ఆరు నెలల కాలానికి విధించి, చివరిగా డిసెంబర్ 04, 2020 వరకు సమయానుసారంగా పొడిగింపబడిన అట్టి నిర్దేశాలు, మరో మూడు నెలల కాలానికి అంటే డిసెంబర్ 05, 2020 నుండి మార్చ్ 04, 2021 వరకు డిసెంబర్ 02, 2020 నాటి ఆదేశం DOR.CO.AID.No.D-37/12.22.254/2020-21 ద్వారా సమీక్షకు లోబడి, అమలులో వుంటాయని భారతీయ రిజర్వు బ్యాంకు తెలియజేస్తుంది. 3. పైన సూచించిన ఆదేశాల యొక్క ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. నిర్దేశాల కాల పరిమితి పొడిగింపును సూచించే ఆదేశం యొక్క నకలు, బ్యాంకు ప్రాంగణంలో ప్రజా వీక్షణార్ధం ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/728 |