RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520931

శివం సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్ కరంజి, కొల్హాపూర్, మహారాష్ట్ర – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్‌ 35 A క్రింద నిర్దేశాలు

తేదీ: 01/08/2020

శివం సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్ కరంజి, కొల్హాపూర్, మహారాష్ట్ర –
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం,1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు),
సెక్షన్‌ 35 A క్రింద నిర్దేశాలు

మే 18, 2018 తేదీ జారీచేసిన DCBS.CO.BSD-I/D-6/12.22.351/2017-18 ఆదేశాలద్వారా, శివం సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్ కరంజి, కొల్హాపూర్, మహారాష్ట్ర, మే 19, 2018 పని ముగింపు వేళల నుండి, నిర్దేశాల పరిధిలోకి తేబడినది. ఆ నిర్దేశాల గడువు, తదుపరి అదేశాల ద్వారా ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, మే 21, 2020 తేదీన జారీ చేసిన చివరి ఆదేశం DOR.CO.AID/D-81/12.22.351/2019-20 ద్వారా, జులై 31, 2020 వరకు సమీక్షకులోబడి, పొడిగించబడింది.

2. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సబ్-సెక్షన్‌ (1), సెక్షన్‌ 35 A (సెక్షన్‌ 56తో సహా), ద్వారా తమకు దఖలు పరచబడ్డ అధికారాలు వినియోగించి, పైన పేర్కొన్న బ్యాంకుకు మే 18, 2018 తేదీ DCBS.CO.BSD-1/D-6/12.22.351/2017-18 ద్వారా జారీ చేయబడి, ఆ తరువాత ఎప్పటికప్పుడు పొడిగించబడుతూ, చివరిసారి జులై 31, 2020 వరకు పొడిగించబడ్డ నిర్దేశాలు, మరొక మూడు నెలలు (అనగా ఆగస్ట్ 01, 2020 నుండి అక్టోబర్ 31, 2020 వరకు) బ్యాంకుకు వర్తిస్తాయని, DOR.CO.AID./D-5/12.22.351/2020-21, తేదీ జులై 24, 2020 ద్వారా అదేశించడం జరిగిందని, ప్రజలకు తెలియజేయడమైనది. ఈ ఆదేశాలు తిరిగి సమీక్షించ వచ్చు.

3. పైన తెలిపిన నిర్దేశాలలోని ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పూ లేదు. కాలపరిమితి పెంచుతూ, జులై 24, 2020 తేదీన జారీచేసిన DOR.CO.AID/D-5/12.22.351/2020-21 ఆదేశాల ప్రతి, శివం సహకారి బ్యాంక్ లి., ఇచ్చల్ కరంజి, కొల్హాపూర్, మహారాష్ట్ర ఆవరణలో, ప్రజల సమాచారార్ధం, ప్రదర్శించబడినది.

4. పైన తెలిపిన కాలపరిమితి పొడిగింపు మరియు / లేక మార్పులు చేసినంతమాత్రాన, బ్యాంకుయొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడిందని రిజర్వ్ బ్యాంక్ సంతృప్తి చెందినట్లుగా, ఏ మాత్రమూ భావించరాదు.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2020-2021/130

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?