<font face="mangal" size="3">శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాడ,  - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాడ, పూణే, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు
తేదీ: 24/12/2019 శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాడ, పూణే, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ జూన్ 21, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-16/12.22.474/2018-19 ద్వారా శ్రీ ఆనంద్ సహకార బ్యాంక్ లిమిటెడ్, చించువాడ, పూణే, మహారాష్ట్ర, జూన్ 21, 2019 పనివేళలు ముగింపు నుండి ఆరు నెలల కాలానికి నిర్దేశాల క్రింద ఉంచబడింది. 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, జూన్ 21, 2019 నాటి ఆదేశం DCBS.CO.BSD-I/D-16/12.22.474/2018-19 ద్వారా డిసెంబర్ 24, 2019 వరకు చెల్లుబాటు ఐయ్యేలా విధించబడిన నిర్దేశాలను, డిసెంబర్ 25, 2019 నుండి మార్చ్ 24, 2020 వరకు మరో మూడు నెలల కాలానికి, డిసెంబర్ 23, 2019 నాటి ఆదేశం DOR.AID/D-44/12.22.474/2019-20 ద్వారా, సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా తెలియచేయడమైనది. 3. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. నిర్దేశాల పొడిగింపును తెలిపే డిసెంబర్ 23, 2019 నాటి ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1507 |