RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78513416

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 35 ఎ క్రింద నిర్దేశాలు – ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర – నగదు ఉపసంహరణ పరిమితికి సడలింపు

మార్చి 05, 2020

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్), సెక్షన్ 35 ఎ
క్రింద నిర్దేశాలు – ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,
ముంబై, మహారాష్ట్ర – నగదు ఉపసంహరణ పరిమితికి సడలింపు

ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఏప్రిల్ 17, 2018 తేదీ నాటి ఆదేశం DCBS/CO.BSD-I/D-5/12.22.039/2017-18 ద్వారా, ఏప్రిల్ 17, 2018 తేదీ పనివేళల ముగింపు నుండి ఆర్బీఐ నిర్దేశాల క్రింద ఉంచబడింది. ఈ నిర్దేశాల వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి ఆదేశాల ద్వారా పొడిగించబడుతూ, క్రితం పర్యాయం అక్టోబర్ 15, 2019 తేదీ నాటి ఆదేశం DCBR.CO.AID/No.D-27/12.22.039/2019-20 ద్వారా, ఏప్రిల్ 17, 2020 తేదీ వరకు సమీక్షకు లోబడి పొడిగిచబడినది. ప్రస్తుతం అమలులోయున్న నిర్దేశాల ప్రకారం, ఇతర షరతులతో పాటు, ప్రతి పొదుపు ఖాతా లేదా కరెంట్ ఖాతా లేదా వేరే పేరు తొ పిలువబడే మరేయితర డిపాజిట్ ఖాతాల మొత్తం నిల్వలో 5000 మించని మొత్తాన్ని ఖాతాదారు ఉపసంహరించుకునేందుకు అనుమతించారు.

2. తదనుగుణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 56 తో కలిపి, సబ్-సెక్షన్ (1) మరియు (2) సెక్షన్ 35ఎ క్రింద తనకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు, ది సిటీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై ఏప్రిల్ 17, 2018 తేదీ న జారీ చేసిన ఆదేశం DCBS/CO.BSD-I/D-5/12.22.039/2017-18 తదుపరి డిసెంబర్ 12, 2018 నాటి సవరణ ఆదేశం No. DCBR/CO.AID/D-24/12.22.039/2018-19 ద్వారా విధించిన నిర్దేశాలలోని పేరా 1(i) ఈ క్రిందివిధంగా పాక్షికముగా సవరించింది:

“ప్రతి ఖాతాదారు పొదుపు ఖాతా లేదా వాడుక ఖాతా లేదా నిర్ణీత కాల డిపాజిట్ ఖాతా లేదా మరేయితర డిపాజిట్ ఖాతాల (వేరే పేరు తొ పిలువబడే) మొత్తం నిల్వనుండి 10,000 (పది వేల రూపాయలు మాత్రమే) మించని మొత్తాన్ని తీసుకోవచ్చు; అయితే ఖాతాదారు ఋణ గ్రహీత గా లేక జామీనుదారుగా మరియు డిపాజిట్లపై ఋణాలు తీసుకుంటే ఈ మొత్తాని బ్యాంక్ ముందుగా సంబంధిత ఖాతా/లకు సర్దుబాటు చేయవచ్చు”.

ఏప్రిల్ 17, 2018 తేదీ నాటి ఆదేశం DCBS/CO.BSD-I/D-5/12.22.039/2017-18, దీనికి తదుపరి సమయానుకూలంగా చేసిన సవరణల లోని అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులలో ఎటువంటిమార్పు లేదు.

4. పైన పేర్కొన్న మార్చి 03, 2020 తేదీ నాటి సవరణల ఆదేశం నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడింది.

5. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న ఆదేశాల సవరణ ను, బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా అన్యధా పరిగణించరాదు.

(యోగేష్ దయాళ్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/2024

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?