<font face="mangal" size="3">బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద నిర్దేశాలు – ది సికెపి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర
అక్టోబర్ 31, 2019 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (ఏఏసిఎస్) సెక్షన్ 35ఎ క్రింద నిర్దేశాలు – ది సికెపి ముంబై, మహారాష్ట్ర లోని ది సికెపి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ను ఏప్రిల్ 30, 2014 తేదీన జారీ చేసిన డైరెక్టివ్ యుబిడి.సిఓ.బియస్డి.I.నం.డి-34/12.22.035/2013-14 ద్వారా మే 02, 2014 తారీఖు వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆర్బీఐ ఆదేశాల క్రింద ఉంచడం జరిగింది. పై అదేశాల వర్తింపు ఎప్పటికప్పుడు తదుపరి డైరెక్టివ్స్ ద్వారా, క్రిందటి పర్యాయము సెప్టెంబర్ 25, 2019 తారీఖు డైరెక్టివ్ డిసిబిఆర్.సిఓ.ఏఐడి/నం.డి-19/12.22.035/2019-20 ద్వారా పొడిగించబడింది మరియు సమీక్షకు లోబడి అక్టోబర్ 31, 2019 తారీఖు వరకు చెల్లుబాటు అవుతుంది. ప్రజల సమాచారంకోసం ఇందుమూలంగా ప్రకటించేదేమిటంటే - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సెక్షన్ 35 ఎ (1) తో పాటు సెక్షన్ 56 (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) ప్రకారం తమకు సంక్రమించిన అధికారాలతో భారతీయ రిజర్వు బ్యాంకు పైన పేర్కొన్న బ్యాంక్ కు జారీచేసిన ఏప్రిల్ 30, 2014 తారీఖు డైరెక్టివ్ యుబిడి.సిఓ.బియస్డి.I నం.డి-34/12.22.035/2013-14 ఎప్పటికప్పుడు సవరించబడుతూ చివరిసారి అక్టోబర్ 31, 2019 వరకు పొడిగింపబడి; మరో మూడు మాసాలపాటు నవంబర్ 01, 2019 నుండి జనవరి 31, 2020 వ తేదీ వరకు ఆ బ్యాంకుకు వర్తిస్తుందని; సమీక్షకు లోబడి తమ అక్టోబర్ 25, 2019 తారీఖు డైరెక్టివ్ డిసిబిఆర్. సిఓ.ఏఐడి/నం.డి-33/12.22.035/2019-20 ద్వారా ఇందుమూలంగా నిర్దేశిస్తున్నారు. అక్టోబర్ 25, 2019 తారీఖు నాటి గడువు పొడిగింపు ఆదేశం డిసిబిఆర్.సిఓ.ఏఐడి/నం.డి-33/12.22.035/2019-20 నకలు ప్రజల పరిశీలనార్ధం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించటం జరిగింది. భారతీయ రిజర్వు బ్యాంకు చే పైన పేర్కొన్న పొడిగింపు మరియు / లేదా సవరణ ను అన్యధా బ్యాంక్ యొక్క ఆర్ధిక పరిస్థితి చెప్పుకోదగిన విధంగా మెరుగుపడిందని రిజర్వు బ్యాంకు సంతృప్తిచెందిందనిగా పరిగణించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1064 |