<font face="mangal" size="3">ది సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహార - ఆర్బిఐ - Reserve Bank of India
ది సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించేది), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు
తేదీ: 31/01/2020 ది సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర - బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 ఏప్రిల్ 30, 2014 నాటి ఆదేశం UBD.CO.BSD.I.No.D-34/12.22.035/2013-14 ద్వారా ది సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర, మే 2, 2014 పనివేళలు ముగింపు నుండి నిర్దేశాల క్రింద ఉంచబడింది. అట్టి నిర్దేశాల కాలపరిమితిని వివిధ ఆదేశాల ద్వారా సమయానుసారంగా పొడిగిస్తూ, చివరిగా అక్టోబర్ 25, 2019 నాటి ఆదేశం DCBR.CO.AID/No.D-33/12.22.035/2019-20 ద్వారా జనవరి 31, 2020 వరకు చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనది. 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 56 తో కలిపి, సబ్ సెక్షన్ (1), సెక్షన్ 35A క్రింద భారతీయ రిజర్వు బ్యాంకుకు ఇచ్చిన అధికారాలను వినియోగించుకొని, ఏప్రిల్ 30, 2014 నాటి ఆదేశం UBD.CO.BSD.I.No.D-34/12.22.035/2013-14 ద్వారా ది సికెపి సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర ఫై సవరణలతో సమయానుసారంగా జనవరి 31, 2020 వరకు చెల్లుబాటు ఐయ్యేలా చివరిగా పొడిగింపబడిన అట్టి నిర్దేశాల కాలపరిమితిని, జనవరి 29, 2020 నాటి ఆదేశం DoR.CO.AID/No.D-52/12.22.035/2019-20 ద్వారా ఫిబ్రవరి 01, 2020 నుండి మార్చ్ 31, 2020 వరకు మరో రెండు నెలల కాలానికి చెల్లుబాటు ఐయ్యేలా, సమీక్షకు లోబడి పొడిగించడమైనదిగా తెలియచేయడమైనది. 3. పై నిర్దేశాల ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పులు వుండవు. నిర్దేశాల పొడిగింపును తెలిపే జనవరి 29, 2020 నాటి DoR.CO.AID/No.D-52/12.22.035/2019-20 ఆదేశం యొక్క ప్రతి, ఆసక్తిగల సభ్యుల పరిశీలన కోసం బ్యాంక్ ప్రాంగణంలో ప్రదర్శించబడినది. 4. పైన పేర్కొన్న నిర్దేశాల పొడిగింపు మరియు/లేదా సవరణలు, బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిలో గణనీయమైన మెరుగుదల పట్ల భారతీయ రిజర్వు బ్యాంకు సంతృప్తికరంగా ఉందని భావించరాదు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1851 |